మినిస్టర్ నాగబాబు... పవన్ సంగతేంటి ?
టీడీపీ జనసేనకు ఇచ్చే మూడు మంత్రి పదవులలో పవన్ కాకుండా ఉంటే మూడవ పోస్ట్ నాగబాబుకు ఇవ్వవచ్చు అని అంటున్నారు.
By: Tupaki Desk | 9 Jun 2024 1:30 PM GMTఏపీలో ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు సారధ్యంలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. టీడీపీకి చెందిన వారు ఎవరు ఉంటారు మంత్రులుగా ఎవరిని చేస్తారు అన్న చర్చ ఒక వైపు వాడిగా వేడిగా సాగుతోంది. అదే టైం లో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అన్నది మరో చర్చగా ఉంది.
అసలు పవన్ ని అధికారంలో చూడాలని జనసైనికులు కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. అయితే పవన్ మాత్రం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లుగా చెబుతున్నారు. ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తారు అని అంటున్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే సమర్ధిస్తూనే ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తే కచ్చితంగా వాటిని ఎదిరించాలని గాడిలో పెట్టాలని పవన్ ఆలోచన చేస్తున్నారుట.
ఆయన ప్రభుత్వంలో ఉంటే ఆ పని చేయడం కుదరదు. అందువల్లనే పవన్ కళ్యాణ్ తాను కూటమి శ్రేయోభిలాషి గా ఉంటూనే తన వారిని మంత్రులుగా చేయడానికే అధిక ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. అయితే పవన్ కాకుండా ఎవరికి మంత్రి పదవులు వస్తాయన్న దాని మీద పెద్ద చర్చ గత కొన్ని రోజులుగా సాగుతోంది.
ముందుగా వినిపించే పేరు నాదెండ్ల మనోహర్. ఆయన తెనాలి నుంచి మంచి మెజారిటీతో గెలిచారు. జనసేనలో పవన్ తరువాత నంబర్ టూగా ఉన్నారు. ఇక ఉత్తరాంధ్రా నుంచి కొణతాల రామకృష్ణ పెరు వినిపిస్తోంది. అయితే మూడవ పదవికి తిరుపతి నుంచి గెలిచిన అరణి శ్రీనివాస్ పేరు కూడా వినబడుతోంది.
టీడీపీ జనసేనకు ఇచ్చే మూడు మంత్రి పదవులలో పవన్ కాకుండా ఉంటే మూడవ పోస్ట్ నాగబాబుకు ఇవ్వవచ్చు అని అంటున్నారు. అలా ఒక బీసీ ఒక కాపు, ఒక కమ్మ అన్నట్టుగా జనసేన నుంచి సమీకరణలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
సడెన్ గా నాగబాబుకు మంత్రి పదవి అన్నది తెర మీదకు రావడంతో అంతా చర్చించుకుంటున్నారు. పవన్ డిప్యూటీ సీఎం అని హోం మంత్రి అని అనేక రకాలైన ప్రచారం సాగిన తరువాత పవన్ అధికార పదవులకు దూరంగా ఉంటారని ఇపుడు వార్తలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి.
పవన్ చాలా దూర దృష్టితోనే ఈ విధంగా చేస్తున్నారు అని అంటున్నారు. ప్రభుత్వంలో ఉంటే అంత సులువుగా విమర్సించలేరు అని అంటున్నారు. అలాగే ప్రభుత్వం పొరపాట్లు చేసినా సరిదిద్ది చెప్పలేరు అని అంటున్నారు. అందుకే తెలివిగానే పవన్ ప్రభుత్వానికి దూరంగా ఉంటూ మిత్రపక్షంగా అవసరమైన సమయంలో ప్రతిపక్షంగా రెండు పాత్రలు పోషించడానికే నిర్ణయించుకున్నారు అని అంటున్నారు.
అదే సమయంలో పవన్ లేకుండా ఎవరు మంత్రులు జనసేన నుంచి అయినా జనసైనికులకు సంతృప్తిగా ఉండదు. అందుకే నాగబాబుని తీసుకుని వచ్చి మంత్రిని చేయాలని పవన్ ప్రతిపాదిస్తున్నారు అని అంటున్నారు. నాగబాబు మంత్రి అంటే జనసేనలో జోష్ అలాగే ఉంటుంది అని అంటున్నారు.
అంతే కాకుండా నాగబాబు అనకాపల్లి ఎంపీ సీటు త్యాగం చేశారు. ఆయనకు సముచితమైన స్థానం ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు. దాంతో మంత్రిగా ఆయన పేరునే సిఫార్సు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక నాగబాబు మంత్రి అయితే ఆయన చట్టసభలలో ఏదో ఒక దాని నుంచి ఆరు నెలలలోగా గెలవాలి. అందుకే ఆయనను ఎమ్మెల్సీగా చేస్తారు అని అంటున్నారు. ప్రస్తుతం నాలుగైదు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అందులో నుంచి జనసేన కోటా కింద నాగబాబుని తొందరలో ఎన్నుకుంటారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ రాజకీయం అదుర్స్ అనిపించేలా ఉంది అని అంటున్నారు.