మంత్రి రోజా భర్తకు నాన్ బెయిల్ వారెంట్.. ఎందుకలా?
తాజా ఉదంతం ఆ కోవకు చెందిందే. ఏపీ మంత్రి ఆర్కే రోజా భర్త సెల్వమణి ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.
By: Tupaki Desk | 29 Aug 2023 4:36 AM GMTసమస్యలు వస్తాయని తెలిసినా పట్టకపోవటం దేనికి నిదర్శనం? మిగిలిన విషయాల్లో ఎలా ఉన్నా.. కోర్టు వాయిదాల విషయంలో.. న్యాయస్థానాల్లో హాజరు విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది ప్రముఖులు ఈ చిన్న విషయాల్ని లైట్ తీసుకోవటం.. ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలకు ఉక్కిరిబిక్కిరి కావటం.. పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి.. సాధారణ పరిస్థితుల్ని తెచ్చుకునేందుకు పడే ప్రయాస అంతా ఇంతా కాదు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవటం అన్న చందంగా పరిస్థితులు అప్పుడప్పుడు చోటు చేసుకుంటూ ఉంటాయి.
తాజా ఉదంతం ఆ కోవకు చెందిందే. ఏపీ మంత్రి ఆర్కే రోజా భర్త సెల్వమణి ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. పరువునష్టం కేసు విచారణకు హాజరు కాని ఆయనపై నాన్ బెయిల్ బెల్ అరెస్టు వారెంట్ జారీ అయ్యింది.
దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని చెన్నై జార్జ్ టౌన్ కోర్టు జారీ చేసింది.ఇంతకూ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎందుకు ఎదురైందన్న విషయాన్ని చూస్తే.. సెల్వమణి చేజేతులారా చేసుకున్నదేనని చెప్పక తప్పదు.
ఏపీ మంత్రి కమ్ నటిగా ఫేమస్ అయిన ఆర్కే రోజా.. ఒకప్పటి ప్రముఖ దర్శకుడు సెల్వమణి ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన.. ఒక కేసులో ముకుంద్ చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ 2016లొ అరెస్టు అయ్యారు. ముకుంద్ కారణంగా తానెన్నో ఇబ్బందులకు గురయ్యానంటూ సెల్వమణి ఒక చానల్ ఇంటర్వ్యూలో చెప్పారన్న ఆరోపణతో కేసు నమోదైంది.
ఇంటర్వ్యూలో చెప్పిన అంశాల కారణంగా తన పరువునకు నష్టం వాటిల్లిందన్నది ముకుంద్ వాదన. దీనికి సంబంధించిన కేసు విచారణ సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ కేసు దాఖలు చేసిన ముకుంద్ మరణించారు.
అయినప్పటికీ..ఆయన కుమారుడు గగన్ బోత్రా మాత్రం కేసును కంటిన్యూ చేస్తున్నారు. తన తండ్రి తరఫున పోరాటం చేస్తున్నారు. దీనికి సంబంధించిన కేసు విచారణ సోమవారం జరిగింది. అయితే.. కోర్టు విచారణకు సెల్వమణి హాజరు కావాల్సి ఉన్నా.. హాజరు కాలేదు. దీంతో.. కోర్టు ఆయనపై నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇష్యూ చేస్తూ నిర్ణయం తీసుకుంది.