Begin typing your search above and press return to search.

మంత్రుల గ్రాఫ్‌పై మ‌రింత స్ట‌డీ.. జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారారా..?

వైసీపీ ప్ర‌భుత్వంలో 25 మంది మంత్రులు ఉన్నారు. వీరంద‌రినీ సీఎం జ‌గ‌న్ ఎంచుకుని మ‌రీ మంత్రుల‌ను చేశారు.

By:  Tupaki Desk   |   16 July 2023 5:00 AM GMT
మంత్రుల గ్రాఫ్‌పై మ‌రింత స్ట‌డీ.. జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారారా..?
X

వైసీపీ ప్ర‌భుత్వంలో 25 మంది మంత్రులు ఉన్నారు. వీరంద‌రినీ సీఎం జ‌గ‌న్ ఎంచుకుని మ‌రీ మంత్రుల‌ను చేశారు. అయితే.. వీరి విష‌యంలో ఇప్పుడు సీఎం జ‌గ‌న్‌కుపెద్ద త‌ల‌నొప్పులే వ‌స్తున్నాయ‌ని అంటున్నారు తాడేప‌ల్లిలోని సీనియ‌ర్లు. వీరు ప్ర‌జ‌ల్లో ఉండ‌రు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున బ‌లమైన వాయిస్ కూడా వినిపించ‌రు. పోనీ.. ప్ర‌తిప‌క్షాలు చేసే విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్లు ఇస్తున్నారా ? అంటే.. కేవ‌లం కొద్ది మంది మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారు.

ఇక‌, గ్రాఫ్ ప‌రంగా చూసుకున్నా..ఐప్యాక్ స‌హా ఇత‌క సంస్థ‌లు ఇచ్చిన రిపోర్టుల్లో స‌గం మంది మంత్రులు ప‌నిచేయ‌డం లేద‌ని తేలింది. దీంతో వీరికి చెక్ పెట్టాల‌నేది ఇప్పుడు పార్టీ అధిష్టానం ఉద్దేశంగా ఉంద‌ని చెబుతున్నారు. కానీ, వీరంతా జ‌గ‌న్ ఏరి కోరి తెచ్చుకు న్న మంత్రులు కావ‌డంతో పాటు.. వారికి సామాజిక వ‌ర్గాల ప‌రంగా కూడా బ‌ల‌మైన నేప‌థ్యం ఉంది. దీంతో వీరిని వ‌దులుకుం టే.. ఆయా సామాజిక వ‌ర్గాల్లో ప్ర‌భావం ఎక్కువ‌గా ప‌డుతుంద‌నే చింత కూడా ఉంద‌ని అంటున్నారు.

ఈ ప‌రిణామాల‌తో ఇప్ప‌టికే చాలా మందికి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని తేల్చి చెప్పారు. అయితే.. రెండు రోజులు ఈ ప‌నిచేస్తు న్నా.. మిగిలిన స‌మ‌యం అంతా కూడా .. మెజారిటీ మంత్రులు క‌నిపించ‌డం లేదు. ఇక‌, ఒక‌రిద్ద‌రు మీడియా ముందుకు వ‌చ్చి హ‌డావుడి చేసి వెళ్లిపోతున్నారు. దీంతో వీరి వ‌ల్ల వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయా నియోజ‌క‌వ‌ర్గాలు కోల్పోతామ‌నే ఆవేద‌న ఆందోళ‌న పార్టీ అధినేత‌లో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనే స‌గం మంది మంత్రుల‌కు సీఎం జ‌గ‌న్ టికెట్ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గాల ప‌రంగా చూసుకున్నా.. కొవ్వూరులో మంత్రి తానేటి వ‌నిత‌కు వ్య‌తిరేక వ‌ర్గం సొంత పార్టీలోనే ఉంది. ప‌లాస‌లో మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. క‌ళ్యాణ‌దుర్గం గురించి ఎంత త‌క్కువ చెప్పుకొంటే అంత మంచిద‌ని వైసీపీ నాయ‌కులే చెబుతున్నారు.

అదేవిధంగా తాడేప‌ల్లి గూడెంలోనూ ప‌రిస్థితి చేయి దాటిపోయింద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఇక‌, క‌ర్నూలులో మంత్రి గుమ్మ నూరు జ‌య‌రాం ఓట‌మిని ఇప్ప‌టికే రాసిపెట్టుకున్నారా? అనే విధంగా అక్క‌డి నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కీల‌క‌మైన క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గంలో అంజాద్ బాషా ప‌రిస్థితి అడ‌క‌త్తెర‌లో ఉంది. ఇక్క‌డ పైకి క‌నిపిస్తున్న విధంగా క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి లేద‌ని నాయ‌కులు చెబుతున్నారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను మార్చ‌డ‌మా.. లేక మంత్రులకు మ‌రో ఛాన్స్ ఇవ్వ‌డ‌మా? అనేది స్ట‌డీ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. జ‌గ‌న్ ఏరికోరి తెచ్చుకున్న మంత్రుల ప‌రిస్థితి ఇప్పుడు ఇబ్బందిగానే మారింద‌ని చెబుతున్నారు.