గుంటూరులో ఘోరం... యువకుడి ప్రాణం తీసిన చిన్న గాయం!
ఒక్కో సారి చిన్నపాటి గాయం కూడా పెద్ద సమస్యకు దారి తీస్తుంటుంది.. ఫలితంగా పూడ్చలేని నష్టాన్ని మిగులుస్తుంది
By: Tupaki Desk | 19 Nov 2023 8:22 AM GMTఒక్కో సారి చిన్నపాటి గాయం కూడా పెద్ద సమస్యకు దారి తీస్తుంటుంది.. ఫలితంగా పూడ్చలేని నష్టాన్ని మిగులుస్తుంది. తాజాగా గుంటూరులో ఒక యువకుడి విషయంలో ఇదే జరిగింది. ఢిల్లీలో సివిల్స్ కి ప్రిపేర్ అవుతూ గుంటూరుకు వచ్చి చిన్న ప్రమాధం జరిగి, చిన్న గాయమే అని లైట్ తీసుకున్నాడో ఏమో కానీ... బ్రెయిన్ డెడ్ అయ్యి మృతిచెందాడు ఒక యువకుడి. ఒక్కగానొక్క కుమారుడు అనంతలోకాలాకు వెళ్లిపోవడంతో ఆ వయసులో ఆ తల్లితండ్రుల బాద వర్ణాణాతీతం!
అవును... సత్తెనపల్లి పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు నివాసముంటున్నారు. వీరిద్దరూ ప్రభుత్వ పాఠశాలో పనిచేస్తున్నారు. వీరికి ఒక్కడే కుమారుడు. దీంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. వారిద్దరికీ కుమారుడే లోకం! ఈ క్రమంలో సివిల్స్ కు సిద్ధమవుతూ తండ్రికి స్వల్ప అనారోగ్య సమస్య రావడంతో ఢిల్లీ నుంచి వచ్చిన యువకుడు ఊహించని రీతిలో మృత్యువాతపడ్డాడు.
వివరాళ్లోకి వెళ్తే... ఉపాధ్యాయ దంపతుల ఒక్కగానొక్క కుమారుడైన నిఖిల్ చక్రవర్తి (28) ఉన్నత స్థాయిలో చూడాలని ఆశపడ్డారు. ఈ క్రమంలో బీటెక్ పూర్తిచేసి సివిల్స్ పై దృష్టి సారించిన నిఖిల్... ఢిల్లీ ఉంటూ శిక్షణ పొందేవాడు. ప్రిలింస్ కూడా ఉత్తీర్ణుడయ్యాడు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ సివిల్స్ లో సత్తా చాటుతాననే ధీమాతో ఉన్నాడు. అయితే అనుకోకుండా తండ్రికి అనారోగ్య సమస్య రావడంతో ఇంటికి వచ్చాడు.
దీంతో సుమారు తండ్రి వెంట ఉంటూ సపర్యలు చేశాడు. ఈ క్రమంలో తండ్రి ఆరోగ్యవంతుడు కావడంతో త్వరలోనే తిరిగి ఢిల్లీ వెళ్లి సివిల్స్ పై శ్రద్ధపెట్టాలని భావించాడు. ఈ క్రమంలో మూడు వారాల క్రితం బైక్ అదుపుతప్పి నిఖిల్ రోడ్డుపై పడిపోయాడు. చేతులకు, కాలికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పీ.హెచ్.సీ. కి వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లాడు. అయితే... చిన్న చిన్న దెబ్బలే కదా అని కాస్త అశ్రద్ధ చేశాడు!
ఈ క్రమంలో కళ్లు మసకగా కనిపిస్తుండటంతో ఈ నెల 12న సత్తెనపల్లిలోని ధూళిపాళ్ల ఎల్.వీ. ప్రసాద్ కంటి ఆసుపత్రికి ఒక్కడే వెళ్లాడు. ఆ ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకుని బయటకు వస్తుండగా కళ్లు తిరిగి పడిపోయాడు. వెంటనే అంబులెన్సులో అతడిని సత్తెనపల్లిలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులు గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రెండ్రోజులపాటు వైద్యానికి రియాక్ట్ అయిన నిఖిల్.. అనంతరం స్పందించడం మానేశాడు. పరీక్షిస్తే... మెదడు పని చేయడం ఆగిపోయింది!
దీనిపై స్పందించిన వైద్యులు... కాలికి అయిన గాయంతో రక్తం గడ్డకట్టి క్రమంగా శరీరంలోని అవయవాలన్నింటినీ దెబ్బతీస్తూ.. ఆఖరికి మెదడు పనితీరు ఆగిపోయేలా చేసిందని తెలిపారు. దీంతో ఎలాగైనా తమ కుమారుడిని కాపాడాలని తల్లితండ్రులు ఆ వైద్యుల్ని ప్రాధేయపడ్డారు. ఈ సమయంలో వైద్యుల ప్రయత్నాలు విఫలమవడంతో అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కన్నవారు ఒక్కసారిగా కూలిపోయారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదని అంటున్నారు!