Begin typing your search above and press return to search.

మిస్ బికిని ఇండియాపై దాడి... వీడియో వైరల్!

ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు దారుణం జరిగింది! మిస్ బికినీ ఇండియాపై దాడిచేశారు. పార్టీ ఆఫీసులోకి రానివ్వకుండా అడ్డుకున్నారు.

By:  Tupaki Desk   |   2 Oct 2023 10:33 AM GMT
మిస్  బికిని ఇండియాపై దాడి... వీడియో వైరల్!
X

ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు దారుణం జరిగింది! మిస్ బికినీ ఇండియాపై దాడిచేశారు. పార్టీ ఆఫీసులోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆ సమయమంలో ఆమె తండ్రి, డ్రైవర్ కూడా ఉండటంతో వారికి గాయలయ్యయని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

అవును... ఉత్తరప్రదేశ్‌ లోని మీరట్ జిల్లాలోని హస్తినాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యడానికి గతేడాది కాంగ్రెస్‌ పార్టీనుంచి టికెట్‌ పొందిన "మిస్‌ బికినీ ఇండియా" అర్చనా గౌతం, తన తండ్రితో కలిసి ఈ రోజు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లారు. ఈ సమయంలో ఆమెను సెక్యూరిటీ లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిసి అభినందించేందుకు తన తండ్రితో కలిసి వచ్చినట్లు అర్చనా గౌతం చెప్పినా కూడా అడ్డుకున్నారు. దీంతో వ్యవహారం చినికి చినికి గాలివానగా మారిందేమో... వీరిపై దాడికి పాల్పడ్డారు.

దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో తాజాగా ఈ విషయంపై అర్చనా గౌతం స్పందించారు. ఇందులో భాగంగా... తనను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి అనుమతించలేదని.. పైగా తనతో పాటు తన తండ్రిని గేటు దగ్గరే కొట్టారరని.. రోడ్డుపైన మా మీద భౌతికంగా దాడి చేశారని.. ఈ ఘటనలో తన తండ్రి, డ్రైవర్‌ కు గాయాలయ్యాయని అర్చనా గౌతం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.

కాగా "మిస్‌ బికినీ ఇండియా"గా, "బిగ్ బాస్ 16 కంటెస్టెంట్‌" గా బాగా పాపులర్ అయ్యింది అర్చనా గౌతం. దీంతో నాడు కాంగ్రెస్ పార్టీ ఈమెకు ఎమ్మెల్యే టిక్కెట్టు ప్రకటించింది. దీంతో బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ కు అభ్యర్థులు దొరకడం లేదని.. అందుకే ఓట్ల కోసం చీప్ జిమ్మిక్కు చేస్తోందని ఎద్దేవా చేశారు. ఆమెకు రాజకీయాల గురించి ఏమాత్రం తెలీదని విమర్శలు చేశారు.

ఈ క్రమంలో తాజాగా అదే అర్చనా గౌతం మీద ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఎదుటే దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన సెప్టెంబర్ 29వ తేదీన జరిగిందని అర్చనా చెబుతున్నారు. ఇదే సమయంలో తనకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడంపై బీజేపీ నేతలు చేసిన కామెంట్లపైనా ఆమె ఘాటుగా స్పందించారు. నటీమణులు ఎవరూ బీజేపీలో లేరా అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా... తాను 2014లో మిస్ ఉత్తరప్రదేశ్‌ గా విజయం సాధించినట్లు చెప్పిన అర్చనా గౌతం... 2018లో మిస్ బికినీ ఇండియా, మిస్ కాస్మో వరల్డ్ - 2018 గా గెలిచినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సామాజ సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు!