Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై రూ.15కోట్లు అప్పు చేసిన ఏఈ

అతడు చేసే ఉద్యోగం మిషన్ భగీరధలో ఏఈగా విధులు నిర్వర్తిస్తుంటాడు. కానీ.. ఆన్ లైన్ గేమ్స్ కు బానిసయ్యాడు.

By:  Tupaki Desk   |   12 March 2024 8:30 AM GMT
ఆన్ లైన్ గేమ్స్ కు బానిసై రూ.15కోట్లు అప్పు చేసిన ఏఈ
X

అతడు చేసే ఉద్యోగం మిషన్ భగీరధలో ఏఈగా విధులు నిర్వర్తిస్తుంటాడు. కానీ.. ఆన్ లైన్ గేమ్స్ కు బానిసయ్యాడు. కట్ చేస్తే.. పలువురు కాంట్రాక్టర్ల వద్ద పనులు ఇప్పిస్తానని చెప్పి రూ.15కోట్లు అప్పులు చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఆన్ లైన్ గేమ్స్.. రమ్మీతో పాటు బెట్టింగ్ గేమ్స్ కు బానిసైన రాహుల్.. పలువురు కాంట్రాక్టర్లను నమ్మించి వారి వద్ద నుంచి భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న వైనం షాకింగ్ గా మారింది.

కొద్ది కాలం క్రితం అతడి మీద తీవ్ర ఆరోపణలు రావటంతో గుట్టుచప్పుడు కాకుండా అతడ్ని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.. అదే శాఖకు సంబంధించి రాహుల్ కు సహకరించిన మరో అధికారిని సైతం సస్పెండ్ చేశారు. దాదాపు 37 మంది కాంట్రాక్టర్ల వద్ద పనులు ఇప్పిస్తానని చెప్పి రూ.15 కోట్ల మేర డబ్బులు తీసుకున్న వైనంపై తాజాగా కీసర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అతడిపై వచ్చిన ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు.

కొన్ని నెలలుగా పరారీలో ఉన్న అతను సోమవారం విదేశాలకు పారిపోతుండగా.. అతడ్ని ఢిల్లీ ఎయిర్ పోర్టులో పోలీసులకు దొరికిపోయాడు. అతడ్ని అదుపులోకి తీసుకున్న కీసర పోలీసులు విచారిస్తున్నారు. రాహుల్ భార్య.. తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ ఉద్యోగులేనని.. రాహుల్ అప్పులకు తాము పూచీకత్తు ఉంటామని చెప్పారని.. కానీ వారేమీ డబ్బులు ఇవ్వలేదంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. మొత్తంగా ఆన్ లైన్ గేమ్స్ మోజులో పడి ఇంత భారీగా అప్పులు చేయటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.