Begin typing your search above and press return to search.

ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు షాకిచ్చారా ?

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కాంట్రాక్టర్లు కేసీయార్ ప్రభుత్వానికి షాకిచ్చినట్లే ఉన్నారు.

By:  Tupaki Desk   |   23 Sep 2023 4:30 PM GMT
ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు షాకిచ్చారా ?
X

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కాంట్రాక్టర్లు కేసీయార్ ప్రభుత్వానికి షాకిచ్చినట్లే ఉన్నారు. ఎలాగంటే మిషన్ భగీరథ పనులుచేసిన కాంట్రాక్టర్లు పెద్దఎత్తున ఇన్జనీరింగ్ ఇన్ చీఫ్ ఆఫీసు ముందు పెద్దఎత్తున ధర్నాచేశారు. తమకు వెంటనే బిల్లులు చెల్లించాలంటు డిమాండ్లు చేశారు. సుమారు 70 మంది కాంట్రాక్టర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. గతంలో ఎప్పుడూ మిషన్ భగీరథ కాంట్రాక్టర్లు ఇలాగ రోడ్డెక్కిన ఘటనలు లేవు. ఇపుడు కూడా ఎందుకు రోడ్డెక్కారంటే గడచిన నాలుగు సంవత్సరాలుగా బిల్లులు పెండింగులో ఉండిపోయాయట.

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేనట్లుంది. ఒకవేళ ప్రభుత్వం మారితే బిల్లుల చెల్లింపులో మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అందుకనే ఎంతవీలుంటే అంత ఈ ప్రభుత్వంలోనే వెంటనే బిల్లులను రాబట్టుకోవాలని కాంట్రాక్టర్లు డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే బిల్లుల చెల్లిపుకు సడెన్ గా ధర్నాచేశారు. తన హయాంలో గొప్పగా కేసీయార్ చెప్పుకునే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో మిషన్ భగీరధ కూడా ఒకటి.

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి సరఫరాకు ఉద్దేశించిందే మిషన్ భగరీధ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును కేసీయార్ గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ కాంట్రాక్టులు చేసిన తమను మాత్రం బిల్లులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నట్లు కాంట్రాక్టర్లు మండిపోతున్నారు. నాలుగు సంవత్సరాలుగా బిల్లులు చెల్లించకపోతే తాము పనులు ఎలాగ చేయాలి, కుటుంబాలను ఎలా పోషించుకోవాలంటు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబా బాద్, వరంగల్, హన్నకొండ జిల్లాల్లోని కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధర్నాలు పాల్గొన్నారు. తొందరలోనే రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లంతా మీటింగ్ పెట్టుకోబోతున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బిల్లుల చెల్లింపుల కోసం కాంట్రాక్టర్లు సడెన్ గా రోడ్డెక్కటం అధికారపార్టీకి ఇబ్బందిగా తయారైంది. ఎందుకంటే ఈ ఘటనను ప్రతిపక్షాలు అడ్వాంటేజిగా తీసుకుంటాయోమననే టెన్షన్ పెరిగిపోతోంది. ఇక్కడ విషయం ఏమిటంటే కాంట్రాక్టర్లకు బిల్లులను నిలిపేసి ఆ మొత్తాన్ని రైతురుణమాఫీతో పాటు ఇతర పథకాల లబ్దిదారులకు ప్రభుత్వం చెల్లిస్తోంది. దాంతో వివిధ శాఖల్లో పనులుచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఆగిపోయాయి. ఆర్ అండ్ బి, వైద్యశాఖ, ఇరిగేషన్ లాంటి శాఖల్లో ఆగిపోయిన బిల్లుల మొత్తం రు. 45 వేల కోట్లుంటుందని అంచనా. మరి ఈ బిల్లులను ఎప్పుడు కేసీయార్ చెల్లిస్తారో చూడాలి.