అమిత్ షాకు బదులు మరొకరి ఫొటోతో పోస్టర్స్.. వైరల్
అసలు విషయం ఏమిటంటే.. అమిత్ షా ఫొటోను ప్రచురించాల్సిన చోట, ఆయనను కొంతవరకు పోలిన తమిళ నటుడు సంతాన భారతి ఫొటోను ప్రచురించారు.
By: Tupaki Desk | 7 March 2025 3:30 PM ISTకేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించనుండటంతో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు అరక్కోణం బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పట్టణమంతా పోస్టర్లు, హోర్డింగ్స్‌తో నిండిపోయింది. అయితే, ఈ ప్రచారంలో భారీ పొరపాటు జరిగింది.
అసలు విషయం ఏమిటంటే.. అమిత్ షా ఫొటోను ప్రచురించాల్సిన చోట, ఆయనను కొంతవరకు పోలిన తమిళ నటుడు సంతాన భారతి ఫొటోను ప్రచురించారు. దీంతో పోస్టర్లు చూసిన వారు అవాక్కయ్యారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
నెటిజన్లు దీనిపై సరదా కామెంట్లు చేస్తున్నారు. "సొంత నాయకుడిని కూడా గుర్తుపట్టలేరా?" అని సెటైర్లు వేస్తుండగా, మరికొందరు "ఇదంతా గూగుల్ సెర్చ్ పొరపాటా?" అంటూ నవ్వుకుంటున్నారు.
ఇప్పటికే ఈ పొరపాటుపై బీజేపీ నేతలు స్పందించి, పోస్టర్లను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, స్క్రీన్‌షాట్లు నెట్టింట విపరీతంగా షేర్ అవుతున్నాయి.
ఈ ఘటన మరోసారి ప్రచార పట్ల జాగ్రత్తగా ఉండాలనే అవసరాన్ని గుర్తు చేసింది. ముఖ్యంగా, రాజకీయ పార్టీలు తమ నేతల పోస్టర్లు, ప్రచార సామగ్రి సక్రమంగా రూపొందించుకోవాలంటే, మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.