Begin typing your search above and press return to search.

కన్నతండ్రి కాటేశాడు.. ఆ పిశాచిని తప్పించుకునే క్రమంలో తప్పులు

అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు.. తీసుకోవాల్సిన నిర్ణయాలు మరింత జాగ్రత్తగా ఉండాలి.

By:  Tupaki Desk   |   5 Jan 2024 5:14 AM GMT
కన్నతండ్రి కాటేశాడు.. ఆ పిశాచిని తప్పించుకునే క్రమంలో తప్పులు
X

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామపిశాచి అయ్యాడు. అతడ్ని తప్పించుకునేందుకు ఆమె వేసిన అడుగులుతప్పుల మీద తప్పుల మాదిరి మారటమే కాదు.. ఆమె జీవితాన్ని మరింత నరకప్రాయంగా మారింది. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఉదంతం గురించి తెలిస్తే అయ్యో అనుకోకుండా ఉండలేని పరిస్థితి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు.. తీసుకోవాల్సిన నిర్ణయాలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు దొర్లినా మరెంత ఇబ్బందికరంగా ఉంటుందన్న విషయాన్ని తెలియజేసే ఉదంతంగా దీన్ని చూడాలి.

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణ నేరం గురించి పోలీసు వర్గాలు అందించిన సమాచారం ఇలా ఉంది. బిహార్ కు చెందిన ఒక ఫ్యామిలీ కుత్భుల్లాపూర్ గ్రామంలో ఉంటోంది. ముగ్గురు పిల్లల్లో పెద్దదైన 18 ఏళ్ల అమ్మాయి తొమ్మిది వరకు చదువుకుంది. కరోనా కారణంగా చదువు మానిపించటంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న ఆమెను కన్నతండ్రే లైంగికంగా వేధించసాగాడు. పలుమార్లు అత్యాచారం చేశాడు. ఎవరికి చెప్పొద్దని భయపెట్టాడు. ఈ క్రమంలో ఆ యువతి తల్లికి తనకు ఎదురవుతున్న నరకం గురించి చెప్పింది.

తండ్రిపై లేనిపోని మాటలు చెబుతావా? అంటూ ఆ తల్లి కూతురిపైనే విరుచుకుపడింది. ఈ క్రమంలో గత ఏడాది దీపావళికి సొంత రాష్ట్రానికి వెళ్లి తిరిగి వచ్చే వేళలో.. రైల్లో సంతోష్ అనే యువకుడు పరిచయమయ్యాడు. బిహార్ కు చెందిన అతడితో పరిచయం పెరిగి పెద్దదైంది. ఇన్ స్టాలో తరచూ చాట్ చేసుకునేవారు. అతను బడంగ్ పేట గాంధీ నగర్ లో ఉంటున్నట్లు చెప్పాడు. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. తాజాగా డిసెంబరు 26న తనను కలవాలని సంతోష్ కోరటంతో ఆమె సికింద్రాబాద్ కు వెళ్లింది. అక్కడి నుంచి సిటీలో పలు ప్రాంతాల్లో తిరిగారు. ఆ తర్వాత ఆమెను కుత్భుల్లాపూర్ లో ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు.

అయితే.. ఇంట్లో కొడతారన్న భయంతో మళ్లీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు పారిపోయింది. అక్కడ రవి అనే వ్యక్తి ఫోన్ తీసుకొని సంతోష్ కు ఫోన్ చేసి.. తన పరిస్థితి చెప్పటంతో.. తన ఇంటికి రావాలన్నాడు. రవి సాయంతో ఆమె అతడి ఇంటికి వెళ్లింది. తర్వాతి రోజు ఆమెను ఇంటికి వెళ్లాల్సిందిగా కోరాడు. సంతోష్ ఇంటికి తీసుకొచ్చిన రవిని తనకు ఉద్యోగం ఏదైనా ఇప్పించాలని కోరగా.. అతను ఆమెను తాను ఉండే అమీన్ పూర్ కు తీసుకెళ్లాడు. రెండు రోజులు అక్కడే ఉంది. డిసెంబరు 29న మద్యం మత్తులో ఆమెను రవి అత్యాచారం చేశాడు.

దీంతో.. తర్వాతి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లిన ఆమె.. ఇంటికి ఫోన్ చేసి.. రైల్వే స్టేషన్ కు రావాలని కోరింది. జరిగిన విషయాన్ని వెల్లడించింది. దీంతో వారు జీడిమెట్ల పోలీసులకు కంప్లైంట్ చేశారు. తనపై జరిగిన అనని దారుణాల్ని వివరించింది. దీంతో.. ఆమె తండ్రిపైనా.. అత్యాచారం చేసిన రవిపైనా కేసు నమోదు చేశారు. ఏమైనా.. ఒక సమస్య నుంచి తప్పించుకోవాలని భావించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మరో సమస్యలోకి వెళ్లకూడదన్న విషయాన్ని ఆమె మర్చిపోవటమే అతి పెద్ద తప్పుగా చెప్పక తప్పదు.