Begin typing your search above and press return to search.

అమరావతికి ఓకే చెప్పిన వైసీపీ...ఆయనే సాక్ష్యం ?

దానికి తగినట్లుగా కేంద్రంతో చర్చలు జరిపింది. తాజా బడ్జెట్ లో 15 వేల కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తున్నట్లుగా కేంద్రం పేర్కొంది.

By:  Tupaki Desk   |   29 July 2024 3:29 PM GMT
అమరావతికి ఓకే చెప్పిన వైసీపీ...ఆయనే సాక్ష్యం ?
X

వైసీపీకి అమరావతి రాజధానికి పడదు అని అంటారు. వైసీపీ అయిదేళ్ళ పాలనలో తీరు అలాగే సాగింది. అసలు మూడు రాజధానులు అన్న వినూత్న కాన్సెప్ట్ ని తీసుకుని రావడం వెనక అమరావతి పట్ల వ్యతిరేకత ఉందని అంతా అనుకున్నారు. దానికి తగినట్లుగానే వైసీపీ నేతలు అంతా అమరావతిలో ఏముంది అంటూ ఎకసెక్కమాడారు.


అక్కడ అప్పటికే ఉన్న నిర్మాణాలకు తట్టెడు మట్టి తీసి పోసిన దాఖలాలు కూడా లేవు. ఈ నేపధ్యం నుంచి చూసినప్పుడు వైసీపీ గుడ్డిగా వ్యతిరేకించిన అమరావతిలో తీవ్ర నిరసనల మధ్య జనం ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఓడించారు.

అదే టైంలో విశాఖ కర్నూలో కూడా వైసీపీ రాజధానులు అన్నా అక్కడ జనాలు అసలు నమ్మలేదు. ఈ పరిణామాలు ఇలా ఉండగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ కూటమి టాప్ ప్రయారిటీగా అమరావతి రాజధానిని పెట్టుకుంది.

దానికి తగినట్లుగా కేంద్రంతో చర్చలు జరిపింది. తాజా బడ్జెట్ లో 15 వేల కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తున్నట్లుగా కేంద్రం పేర్కొంది. అయితే అది ఆర్ధిక సాయం కాదని రుణం అని ఆ తరువాత తెలిసింది. దాంతో దీనిని అస్త్రంగా మార్చుకుంటోంది వైసీపీ.

లోక్ సభలో వైసీపీ నేత మిధున్ రెడ్డి అమరావతి రాజధానికి కెంద్రం అప్పులు ఇవ్వడం కాదు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ మీద జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానికి అనుకూలంగా డిమాండ్ చేయడం విశేషం. దీని మీదనే ఇపుడు చర్చ సాగుతోంది. ఓటమి భారీగా వచ్చిన తరువాత వైసీపీలో మార్పు కనిపిస్తోందా అన్నదే ఆ చర్చ.

అమరావతి రాజధాని ఇక శాశ్వతం అన్నది వైసీపీని అర్ధమైంది అని అంటున్నారు. అంతే కాదు తాము మూడు రాజధానులు అంటూ తీసుకున్న లైన్ తప్పు అని కూడా అర్ధం అయింది అని అంటున్నారు. దాంతోనే వైసీపీ పార్లమెంట్ లో అమరావతి రాజధానికి అనుకూలంగా మాట్లాడింది అని అంటున్నారు.

మరి మిధున్ రెడ్డి మాట్లాడారూ అంటే అధినేత జగన్ అనుమతితోనే కాబట్టి వైసీపీ ఆలోచనలలో మార్పు మొదలైంది అని అంటున్నారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని కూడా మిధున్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది కూడా గతం కంటే గట్టిగానే వినిపించిన వాయిస్ గా అంతా చూస్తున్నారు.

మరో వైపు చూస్తే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి కారకులు ఎవరూ అంటూ టీడీపీ మీద ఆయన పరోక్ష విమర్శలు చేసారు. అలాగే విశాఖ మెట్రో రైల్ కడప స్టీల్ ప్లాంట్ ల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. మొత్తానికి ఒక్క ఘోరమైన ఓటమి వైసీపీ నోట అమరావతి అన్న మాటను పలికించింది అని అంటున్నారు.