Begin typing your search above and press return to search.

అందమైన అమ్మాయిలు రైతుబిడ్డను పెళ్లాడరు.. ఆ ఎమ్మెల్యే దుమారం

ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి.

By:  Tupaki Desk   |   3 Oct 2024 4:19 AM GMT
అందమైన అమ్మాయిలు రైతుబిడ్డను పెళ్లాడరు.. ఆ ఎమ్మెల్యే దుమారం
X

ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. అందమైన అమ్మాయిలు రైతుబిడ్డను పెళ్లి చేసుకోరని.. అందంగా లేని అమ్మాయిలే వారికి దిక్కుగా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యే ఒకరు చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతు కుటుంబంలో పుట్టిన అబ్బాయిల్ని అమ్మాయిలు.. అందమైన అమ్మాయిలు పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడరన్నారు.

అమ్మాయిల్ని మూడు రకాలుగా విభజించిన సదరు ఎమ్మెల్యే (దేవేంద్ర భుయార్) మొదటి వర్గంగా అందమైన అమ్మాయిలుగా పేర్కొంటూ.. ‘‘మీలాంటి.. నాలాంటి వాళ్లను ఇష్టపడరు. మంచి ఉద్యోగం ఉన్న వారినే పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడతారు. ఒక మోస్తరు అందంగా ఉండే రెండోకేటగిరి అమ్మాయిలుకిరాణా.. పాన్ షాప్ లను నడిపే వారిని ఎంచుకుంటారు’’ అని పేర్కొన్నారు.

మూడో రకానికిచెందిన వారే రైతు బిడ్డను పెళ్లాడతారంటూ పేర్కొన్న ఎమ్మెల్యే.. ‘‘అటువంటి దంపతులకు పుట్టే పిల్లలు కూడా అందవిహీనంగా ఉంటారు’ అని వ్యాఖ్యానించటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఎమ్మెల్యే దేవేంద్ర భుయార్ వరూడ్ - మోర్షీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కు సన్నిహితుడైన ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీ నేతలతో పాటు మహిళా సంఘాల నుంచి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళల్ని అలా వర్గీకరిస్తూ వ్యాఖ్యానించటాన్ని ఎవరూ సహించరన్న ఆయన.. అలాంటి వారికి గుణపాఠం తప్పదన్నారు. మొత్తంగా ఎమ్మెల్యే భుయార్ చేసిన వ్యాఖ్యలు తాజా సంచలనంగా మారాయి.