Begin typing your search above and press return to search.

డాక్టర్ ఎమ్మెల్యే కొత్త అవతార్...కూటమికే షాకింగ్ !

రాజకీయంగా కూడా సబ్జెక్ట్ తోనే ప్రత్యర్ధులకు నోరు తిప్పకుండా జవాబు చెప్పేవారు.

By:  Tupaki Desk   |   24 Dec 2024 4:00 AM GMT
డాక్టర్ ఎమ్మెల్యే కొత్త అవతార్...కూటమికే షాకింగ్ !
X

ఆయన వైద్య వృత్తిలో ఉంటూ మేధావిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయంగా కూడా సబ్జెక్ట్ తోనే ప్రత్యర్ధులకు నోరు తిప్పకుండా జవాబు చెప్పేవారు. టీవీ డిబేట్లలో ఆయన చర్చలను చాలా మంది వినేవారు. ఆలోచింపచేసేలా మాట్లాడడమే కాకుండా అనేక గణాంకాలను కూడా వల్లిస్తూ రాష్ట్రం గురించి తమ ప్రాంతం గురించి సమగ్రమైన అవగాహన కలిగిన నేతగా గుర్తింపు పొందారు

ఆయనే కర్నూలు జిల్లాలోని ఆదోని నుంచి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ పార్ధసారధి. అదోనీ వైసీపీకి కంచుకోట. కూటమిలో టికెట్ ని పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. అలా పార్ధసారధి దక్కించుకున్నారు. వైసీపీ కంచుకోటలో కాషాయం జెండా ఎగరేసిన పార్ధసారధి ఆరు నెలల ఎమ్మెల్యేగా సరికొత్త అవతార్ లో కనిపిస్తున్నారు అని అంటున్నారు

డాక్టర్ గా మేధావిగా సాఫ్ట్ గా ఉంటారు అనుకుంటే ఆయన దూకుడు చూపిస్తూండడంతో సొంత పార్టీతో పాటు ఇటు కూటమిలోని టీడీపీ అలాగే ప్రత్యర్ధి వైసీపీలోనూ చర్చ సాగుతోంది. నా మాటే శాసనం అన్నట్లుగా ఆయన మాట్లాడుతునారు. నేను చెప్పాను అంటే చంద్రబాబు చెప్పినట్లే అని ఆయన తాజాగా వాడిన డైలాగ్ ఇపుడు వైరల్ అవుతోంది.

ఏ ఒక్క ఆర్ధిక ప్రయోజనం ఉన్న పదవిని అయినా వైసీపీ నేతలు చేపట్టడానికి వీలు లేదని అన్నీ వదులుకోవాల్సిందే అని ఆయన జారీ చేసిన హుకుం ఇపుడు రాజకీయంగా కలకలం రేపుతొంది. అంతే కాదు ఆయన క్యాడర్ ని ఉత్తేజపరుస్తూ ఇక వారిది కాదు మనదే జమానా అన్నట్లుగా మాట్లాడడంతో కూటమిలోని పార్టీల నేతలు కూడా ఏమిటి డాక్టర్ గారి దూకుడు అని చర్చించుకునే పరిస్థితి వచ్చింది.

ఎమ్మెల్యే కాకముందు సాఫ్ట్ గా ఉండే ఆయన ఇపుడు ఇలా మారిపోయారని అంటున్న వారూ ఉన్నారు. అయితే ఫ్రాక్షన్ ప్రాంతంలో ప్రాజా ప్రతినిధిగా ఉండాల్సి వచ్చినపుడు ఈ రకమైన దూకుడు తప్పనిసరి అని ఆయన మద్దతుదారులు అంటున్నారు.

ఒక వైపు గూండాయిజం ఎవరు చేసినా నచ్చదు అని చెబుతూనే మరో వైపు ఎమ్మెల్యే ఇస్తున్న ఈ తరహా ప్రకటనలు సైతం చర్చకు దారి తీస్తున్నాయి. ఈ విధంగా వ్యవహరిస్తే అది పార్టీకి చేటు తెస్తుందని బీజేపీలో కూడా అంతర్గతంగా చర్చ అయితే సాగుతోంది అని అంటున్నారు.

ఇక ఎమ్మెల్యే ఆరు నెలల కాలంలో ఇలాంటి ప్రకటనలు చాలానే చేశారు అని అంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా సొంబగల్లు అనే గ్రామానికి వెళ్ళినపుడు అక్కడి ప్రజలు నీళ్ళు లేవు అని చెప్పడంతో సర్పంచుని చొక్కా పట్టుకుని ఆడగాలని సలహా ఇచ్చారట. అలాగే మాంత్రికి అనే మరో గ్రామంలో నీళ్ళ ఇబ్బందుల గురించి జనాలు చెబితే వాటర్ మ్యాన్ ని చెట్టుకు కట్టేసి కొట్టండి అని వారికే పురిగొల్పారని అంటున్నారు.

ఎమ్మెల్యే తీరు మీద అయితే చర్చ సాగుతోంది. ఫ్యాక్షనిజం బాగా ఉన్న ఏరియా కావడంతో తాను ఈ తరహాలో ఉండకపోతే రాజకీయం నడవదని భావించే ఆయన ఇలా చేస్తున్నారు అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే ఈ డాక్టర్ ఎమెల్యేకు కేంద్ర హోం మంత్రి స్థాయిలో పలుకుబడి ఉందని అంటున్నారు. ఆయన వల్లనే అదోనికి స్థానికేతరుడు అయినా టికెట్ తెచ్చుకుని గెలిచారని అంటున్నారు.

ఆ అండ చూసుకునే ఆయన ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారా అన్నది కూడా చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా మేధావిగా టీవీ డిబేట్లలో కనిపించిన పార్ధసారధి ఇలా మాట్లాడారు అని అంటే అంతా ఆలోచిస్తున్నారు. అయితే ఆయన తన మార్క్ పాలిటిక్స్ ఈ విధంగా ఉంటుందని చెబుతున్నారని అనుచరులు అంటున్నారు.