Begin typing your search above and press return to search.

"వాళ్లను బట్టలూడదీసి కొడతా!"... జగ్గారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్!

తాజాగా గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి... ఇటీవల కొంతమంది ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

By:  Tupaki Desk   |   26 Oct 2024 2:30 PM GMT
వాళ్లను బట్టలూడదీసి కొడతా!... జగ్గారెడ్డి స్ట్రాంగ్  వార్నింగ్!
X

"ఎవడు బడితే వాడు బుడ్డోడూ బుడ్డోడూ అంటే గుడ్డలూడదీసి కొడతా.." ఓ సినిమాలో డైలాగ్.. అది సూపర్ హిట్! "ఏయ్ నిన్ను బట్టలిప్పి తంతా”!... “నన్ను తన్నడానికి నువ్వు బట్టలు ఇప్పడం ఎందుకన్నా?".. మరో సినిమాలో డైలాగ్... అదీ హిట్టే! మరి అవే ఇనిస్పిరేషనో.. లేక, అంతకంటే ముందు నుంచే ఉందో తెలియదు కానీ... తాజాగా జగ్గారెడ్డి ఈ స్థాయిలోనే మాస్ వార్నింగ్ ఇచ్చారు.

అవును... కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా బీఆరెస్స్ సోషల్ మీడియా జనాలకు, వారిని కంట్రోల్ చేయలేకపోతున్న బీఆరెస్స్ పార్టీ పెద్దలకు అంటూ ఓ భారీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగా.. తనని ట్రోల్స్ చేసిన వారిని బహిరంగంగా బట్టలూడదీసి కొడతానని హెచ్చరిక చేశారు.

తాజాగా గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి... ఇటీవల కొంతమంది ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రుల మీద సోషల్ మీడియాలో కాంగ్రెస్ వ్యతిరేకులు తప్పుడు పోస్టులు పెడుతున్నారని విమర్శిస్తూ... బీఆరెస్స్ సోషల్ మీడియా గ్రూపు దండుపాళ్యం బ్యాచ్ లా తయారయ్యిందని అన్నారు.

ఇదే సమయంలో... కేటీఆర్, హరీష్ కు మతిభ్రమించిందని.. అధికారం లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. సీఎం రేవంత్ ను బద్నాం చేయాలని చూస్తున్నారని.. బీఆరెస్స్ సోషల్ మీడియా దండుపాళ్యం బ్యాచ్ లా మారిందని.. తాను కలెక్టర్ ని తిట్టినట్లు వీడియో క్రియేట్ చేశారని.. తనపై తప్పుడు ప్రచారం చేసినవారిని వదిలిపెట్టనని జగ్గారెడ్డి హెచ్చరించారు.

మరోపక్క జీవన్ రెడ్డి వ్యవహారంపైనా జగ్గారెడ్డి స్పందించారు. ఆయన ఆవేదన చూసి బాధ కలిగిందని అన్నారు. అసలు ఏమి జరిగిందే తనకు అర్థంకావడం లేదని చెబుతూ.. జీవన్ రెడ్డికి తాను అండగా ఉంటానని అన్నారు. జీవన్ రెడ్డి ఫక్తూ కాంగ్రెస్ వాది అని.. ఆయన జీవితమంతా కష్టాలే అని.. అసలు జగిత్యాల ప్రజలు ఆయనను ఎందుకు ఓడించారో తెలియదని వాఖ్యానించారు.