ఎమ్మెల్యే లాస్య మృతి కేసు... తెరపైకి డ్రంక్ అండ్ డ్రైవ్!
By: Tupaki Desk | 24 Feb 2024 12:02 PM GMTకంటోన్మెంట్ బీఆరెస్స్ ఎమ్మెల్యే లాస్య నందిత అవుటర్ రింగ్ రోడ్డుపై కారు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఏడాది తేడాలో తండ్రీ కుమార్తె మృతిచెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈమె మృతిపట్ల అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు, నేతలు, అధినేతలు, మంత్రులు, ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ సంగతి అలా ఉంటే... ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవ్ చేస్తున్న ఆకాష్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యిందని తెలుస్తుంది.
కారుప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన కేసులో ఆ సమయంలో డ్రైవింగ్ చేస్తున్న ఆకాష్ పై పోలీసులు దృష్టిసారించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఆకాష్ పై కేసు నమోదు చేసినట్లు సంగారెడ్డి జిల్లా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం ఘటనపై లాస్య సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆకాష్ పై 304ఏ సెక్షన్ కింద పటాన్ చెరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైందని తెలుస్తుంది.
ఈ క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతి వేగంగా కారు నడిపాడని లాస్య సోదరి నివేదిత తన ఫిర్యాదులో పేర్కొన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో హైప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ప్రతీ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగానే... తాజాగా ఆకాష్ కి పోలీసులు డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ కూడా చేశారని తెలుస్తుంది.
అవును... లాస్య నందిత కారు ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ ఆకాష్ మధ్యం సేవించి ఉన్నాడా? అనే విషయంపై పోలీసులు దృష్టిపెట్టారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... అతడి బ్లడ్ శాంపుల్స్ ని పరీక్షలకు పంపారు! ఇదే సమయంలో అతడి ఫోన్ వివరాలను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తుంది. కాగా.. ఇప్పటికే మెజిస్ట్రేట్ ఎదుట ఆకాష్ వాంగ్మూలం తీసుకున్నారు! హై ప్రొఫైల్ కేసు కావడంతో సంబంధిత శాఖలోని నిపుణులతో దర్యాప్తు చేస్తున్నారు.