ఏపీలో ఏ కులం నుంచి ఎంతమంది ఎన్నికయ్యారో తెలుసా?
అవును... ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంతమంది నేతలు ఏయే సామాజికవర్గాల నుంచి ఎంపికయ్యారనే విషయం తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 9 Jun 2024 5:37 AM GMTభారతదేశ రాజకీయాల్లో సమాజికవర్గం అనేది ఎంత కీ రోల్ పోషిస్తుందనేది తెలిసిన విషయమే. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీని పాత్ర మరింత ఎక్కువగా ఉంటుందనేదీ అంతకంటే బాగా తెలిసిన విషయమని అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే... ఏపీలో రాజకీయం కులాన్ని నడిపిస్తుందో లేదో తెలియదు కానీ... కులం మాత్రం కచ్చితంగా రాజకీయాని నడిపిస్తుందని చెబుతుంటారు.
అందుకేనేమో ఏ రాజకీయ పార్టీ అయినా తమ ప్రచార కార్యక్రమాల్లో అత్యధిక జనాభా ఉన్న సామాజికవర్గాల, బడుగు బలహీన వర్గాల జనోద్దరణకే కంకణం కట్టుకున్నట్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చెబుతుంటాయి. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఏ సామాజికవర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారనే విషయం తెరపైకి వచ్చింది.
అవును... ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంతమంది నేతలు ఏయే సామాజికవర్గాల నుంచి ఎంపికయ్యారనే విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఏపీ రాజకీయాలను శాసించే సామాజికవర్గాలుగా పేరుగాంచాయనే పేరున్న కమ్మ, రెడ్డి సామాజికవర్గాల నుంచి అత్యధికంగా ప్రజాప్రతినిధులు చట్టసభలకు ఎన్నికయ్యారు.
ఇందులో భాగంగా టాప్ ప్లేస్ లో కమ్మ సామాజికవర్గం నుంచి 35 మంది ఎన్నికవ్వగా... ఆ తర్వాత స్థానంలో రెడ్డి సామాజికవర్గం నుంచి 32 మంది ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు. ఆ తర్వాత స్థానంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి 29 మంది ఎన్నికవ్వగా... ఈ ఎన్నికల్లో కూటమి విజయంలో కీలక భూమిక పోషించారని చెబుతున్న కాపు / బలిజ సామాజికవర్గాల నుంచి 18 మంది ఎన్నికయ్యారు.
ఇక ఆ తర్వాత స్థానాల్లో క్షత్రియ సామాజికవర్గం నుంచి 7గురు, కొప్పు / పొలినాటి వెలమ సామాజికవర్గాల నుంచి 7గురు, ఎస్టీల నుంచి 7గురు ఎన్నికయ్యారు. ఇదే సమయంలో యాదవ సామాజికవర్గం నుంచి 6, తూర్పు కాపు 5, గౌడ 4, బోయ 4, మత్స్యకార 3, ముస్లిం 3, కలింగ 2, శెట్టిబలిజ 2, గవర 2, వైశ్య 2 చొప్పున నేతలు ఎన్నికయ్యారు. ఇక మిగిలిన కొన్ని సామాజికవర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎన్నికయ్యారు.
కమ్మ - 35
రెడ్డి - 32
ఎస్సీ - 29
కాపు + బలిజ - 18
క్షత్రియ - 07
కొప్పు/పోలినాటి వెలమ - 07
ఎస్టీ - 07
యాదవ- 06
తూర్పు కాపు - 05
గౌడ - 4
బోయ - 4
మత్స్యకార - 3
ముస్లిం - 3
కళింగ - 2
శెట్టి బలిజ - 2
గవర - 2
వైశ్య - 2
బ్రాహ్మణ - 1
పద్మనాయక వెలమ - 1
కురుబ - 1
రజక - 1
సూర్య బలిజ - 1
పద్మశాలి / దేవంగ / చేనేత - 01
మరాఠా - 1