Begin typing your search above and press return to search.

172 ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం... మిగిలిన ముగ్గురూ?

ఇందులో భాగంగా... జివీ ఆంజనేయులు (వినుకొండ), పితాని సత్యనారాయణ (ఆచంట), వనమాడి వెంకటేశ్వరరావు (కానినాడ సిటీ) లు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు.

By:  Tupaki Desk   |   21 Jun 2024 1:58 PM GMT
172 ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం...  మిగిలిన ముగ్గురూ?
X

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. రెండు రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో తొలిరోజు శాసన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సమయంలో ప్రోటెం స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో కొత్తగా ఎన్నికైన 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.

అవును... నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఏపీలో తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. రెండు రోజుల పాటుజరిగే ఈ సమావేశాల్లో తొలిరోజు 172 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ఈ మేరకు ప్రోటెం స్పీకర్ వారందరితోనూ ప్రమాణం చేయించారు. వీరిలో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదు. దీంతో వారి ప్రమాణస్వీకారం వాయిదా పడింది.

ఇలా ఈరోజు హాజరుకాని ముగ్గురు ఎమ్మెల్యేలూ టీడీపీకి చెందినవారే కావడం గమనార్హం. ఇందులో భాగంగా... జివీ ఆంజనేయులు (వినుకొండ), పితాని సత్యనారాయణ (ఆచంట), వనమాడి వెంకటేశ్వరరావు (కానినాడ సిటీ) లు ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలూ శనివారం ఉదయం ప్రమాణం చేస్తారని టీడీపీ హైకమాండ్ తెలిపింది.

మరోపక్క శనివారం ఈ ముగ్గురు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తయిన అనంతరం ఉదయం 11 గంటలకు స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని శాసన సభ ఎన్నుకోనుంది. కాగా... ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ గా టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు అయ్యన్న తరపున కూటమి నేతలు నామినేషన్‌ సమర్పించారు.

ఇందులో భాగంగా... అయ్యన్నపాత్రుడి తరుపున మంత్రులు పవన్‌ కల్యాణ్, నారా లోకేష్‌, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యప్రకాశ్ లు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. మరోపక్క డిప్యుటీ స్పీకర్ పోస్ట్ కూడా టీడీపీనే దక్కించుకునే అవకాశం ఉందని అంటున్నారు.