Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లికి ఎన్నికల వేళ షాక్

విశాఖ సౌత్ నుంచి టీడీపీ తరఫున గెలిచి వైసీపీలోకి జంప్ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ కి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   12 Aug 2023 3:56 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లికి ఎన్నికల వేళ షాక్
X

విశాఖ సౌత్ నుంచి టీడీపీ తరఫున గెలిచి వైసీపీలోకి జంప్ చేసిన వాసుపల్లి గణేష్ కుమార్ కి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ ఎమ్మెల్యేకు అనూహ్యంగా ఎన్నికల వేళ షాక్ తగిలినట్లు అయింది. వాసుపల్లి ఒక వ్యక్తి మీద దాడి చేసిన కేసులో ఏ 2గా ఉన్నారు. దీంతో ఈ కేసుని విచారించిన విశాఖ రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు వాసుపల్లికి ఆరు నెలల సాధారణ జైలుతో పాటు అయిదు వేల రూపాయల జరీమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

ఇక వాసుపల్లి టీడీపీ నుంచె రాజకీయ రంగం ప్రవేశం చేశారు. ఆయన 2009లో తొలిసారి పోటీ చేసి ఓడినా 2014, 2019లలో గెలిచారు. 2020లో ఆయన వైసీపీలో చేరిపోయారు. 2024లో ఆ పార్టీ నుంచే పోటీ చేయాలని రెడీ అవుతున్నారు.

ఈ నేపధ్యంలో పాత కేసుగా ఉన్న ఈ కేసులో తీర్పు రావడం జైలు శిక్ష ఖరారు కావడంతో ఆయన అనుచరులు కలవరపడుతున్నారు. అయితే ఈ కేసులో అప్పీల్ కి వెళ్తాను అని వాసుపల్లి అంటున్నారు. ఏది ఏమైనా వాసుపల్లి కేసు జైలు శిక్ష మాత్రం సంచలనం కలిగించేదిగానే ఉంది అని అంటున్నారు. అధికార పార్టీలో చురుకుగా ఉంటూ వస్తున్న వాసుపల్లి వరసగా మూడవసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.

ఈ పరిణామంతో రాజకీయంగా ఇబ్బంది ఎంత వరకూ ఉంటుంది అన్న చర్చ కూడా మొదలైంది. అయితే వాసుపల్లి అప్పీల్ ద్వారా ఈ కేసు విషయంలో న్యాయ పోరాటానికే డిసైడ్ అయ్యారు. చూడాలి మరి ఆయన మీద ఉన్న ఈ కేసు చిన్నదే. ఆరు నెలలు మాత్రమే జైలు శిక్ష పడింది కాబట్టి రాజకీయంగా పోటీ చేసేందుకు ఇబ్బంది లేకపోవచ్చు కానీ ప్రజా జీవితంలో ఉన్న వారి మీద ఇలాంటివి వస్తే ప్రత్యర్ధులకు ఆవి ఆయుధాలుగా మారుతాయి. ఆ విధంగా చూస్తే వాసుపల్లిని ఆయన పూర్వపు పార్టీ టీడీపీ రాజకీయ దాడితో ఇబ్బంది పెడుతుందా అన్నది చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు.