Begin typing your search above and press return to search.

గవర్నర్‌ కు మహిళా ఎమ్మెల్సీ ఫిర్యాదు!

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీకి కష్టాలు మొదలయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Oct 2024 7:34 AM GMT
గవర్నర్‌ కు మహిళా ఎమ్మెల్సీ ఫిర్యాదు!
X

ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీకి కష్టాలు మొదలయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి వరుసగా పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు రాజీనామా చేశారు. వీరిలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కూడా ఒకరు.

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా కర్రి పద్మశ్రీ ఉన్నారు. గతంలో ఆమె జాతీయ మత్య్సకార మహిళా అధ్యక్షురాలుగా, రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ క్రమంలో వైసీపీలో చేరిన ఆమె మార్చి 2023లో గవర్నర్‌ కోటా నుంచి ఎమ్మెల్సీగా నామినేట్‌ అయ్యారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీకి ఆమె రాజీనామా ప్రకటించారు. అంతేకాకుండా తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామాను శానసమండలి చైర్మన్‌ కొయ్య మోషేన్‌ రాజుకు అందజేశారు. అయితే ఇంతవరకు ఆ రాజీనామాను ఆమోదించలేదు. రాజీనామా ఆమోదం పొందిన తర్వాత టీడీపీలో చేరాలనే ఉద్దేశంతో కర్రి పద్మశ్రీ ఉన్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే రెండు పర్యాయాలు శాసనమండలి చైర్మన్‌ కొయ్య మోషేన్‌ రాజుకు లేఖలు రాసి తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే ఇంతవరకు ఫలితం లేదు. దీంతో కర్రి పద్మశ్రీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ను కలిసి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

నెల రోజుల కిందట వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని.. అయితే, ఇప్పటి వరకు తన రాజీనామాకు ఆమోదముద్ర పడలేదని గవర్నర్‌ కు ఆమె ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. తన రాజీనామాపై మండలి చైర్మన్‌ ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదని.. రాజీనామాను ఆమోదించాలని ఆయనను ఆదేశించాలని గవర్నర్‌ ను కోరతారని టాక్‌ నడుస్తోంది.

ఇప్పటికే తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని చైర్మన్‌ మోషేన్‌ రాజుకు రెండోసారి కర్రి పద్మశ్రీ లేఖ రాశారు. రాజీనామా ఆమోదం పొందితే తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఆమె నిర్ణయించుకున్నట్టు సమాచారం.

ఈ మేరకు ఇప్పటికే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై.. పార్టీలో చేరికపై ^è ర్చించారని టాక్‌ న డుస్తోంది.