Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన ఓ వీడియో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Aug 2024 10:23 AM GMT
ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో వ్యవహారంలో బిగ్  ట్విస్ట్!
X

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన ఓ వీడియో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ, ఇతర పార్టీల నేతలు అనంతబాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరోపక్క అనంతబాబు హనీ ట్రాప్ లో పడ్డాడా అనే చర్చా మొదలైంది. ఈ నేపథ్యంలో ఓ బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది.

అవును... తనకు సంబంధించిందంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతూ, తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో ఎమ్మెల్సీ అనంతబాబు స్పందించారు. ఇందులో భాగంగా... మార్ఫింగ్ వీడియోతో తనను బ్లాక్ మెయిల్ చేశారని అన్నారు. ఫ్రెండ్ కుమారుడి పుట్టిన రోజున వీడియో కాల్ మాట్లాడుతూ, బర్త్ డే బాబుకు ముద్దులు పెట్టినట్లు తెలిపారు.

ఆ వీడియో కాల్ ను మార్ఫింగ్ చేసి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అనంతబాబు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే రంపచోడవరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొంతమంది తనను డబ్బుల కోసం భయపెడుతున్నారని తాజాగా ఎమ్మెల్సీ అనంతబాబు స్పష్టం చేశారు.

అది పూర్తిగా ఎడిట్ చేసిన వీడియో అని చెబుతు.. దీనిపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు గత ఆరు నెలలుగా తెలంగాణకు చెందిన కొంతమంది తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. డబ్బులు ఇవ్వకుంటే ఆ వీడియోలు బయటపెడతామని బెదిరిస్తున్నారని ఆయన వివరించారు. బర్త్ డే రోజు ఫుటేజిని ఇతర కంటెంట్ తో కలిపారని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యక్తుల బెదిరింపులపై అడ్డతీగల సర్కిల్ ఇన్ స్పెక్టర్ కు జూన్ 1న సమాచారం ఇచ్చినట్లు అనంతబాబు వివరించారు. ఇదే సమయంలో.. అనంతబాబు ఇచ్చిన ఫిర్యాదుపై రంపచోడవరం ఏఎస్పీ స్పందించారు. సమగ్ర విచారణ కోసం సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్సీని కోరినట్లు తెలిపారు.