Begin typing your search above and press return to search.

కొత్త చర్చ... ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేల మాదిరి సమానంగా చూడాలి!

ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలతో సమానంగా తమకూ సముచిత గౌరవం టీటీడీ అధికారులు ఇవ్వాలని ఎమ్మెల్సీలు కోరారు.

By:  Tupaki Desk   |   23 July 2024 9:15 AM GMT
కొత్త చర్చ... ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేల మాదిరి సమానంగా చూడాలి!
X

ఏపీలో శాసన సభ, శాసన మండలి సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మండలిలో నేడు ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యేలతో సమానంగా ఎమ్మెల్సీలనూ చూడాలంటూ సభ్యులు స్పీకర్ వద్ద ప్రస్థావించగా.. ఇది పెద్దల సభ ఎంకా ఎక్కువ అడగాలంటూ స్పందించారు. దీనికంతటికీ కారణం టీటీడీ లెటర్స్ కావడం గమనార్హం.

అవును... ఎమ్మెల్సీలను కూడా ఎమ్మెల్యేల మాదిరిగానే సమానంగా చూడాలంటూ ఎమ్మెల్సీలు రవీంద్ర, లక్షణరావు, వెంకటేశ్వర్ రావు కోరారు. దీనికంతటికీ కారణం... టీటీడీ లేఖలు కావడం గమనార్హం. ఈ మేరకు... స్పందించిన ఎమ్మెల్సీలు.. ఇప్పటివరకూ నాలుగు రోజులు, లేఖకు 6 మందికి దర్శనం అనుమతి ఇస్తున్నారని.., దాన్ని ఆరు రోజులకు, లెటర్ కు 10 మందికి దర్శనానికి అనుమతి ఇవ్వాలని కోరారు.

ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలతో సమానంగా తమకూ సముచిత గౌరవం టీటీడీ అధికారులు ఇవ్వాలని ఎమ్మెల్సీలు కోరారు. ఈ సందర్భంగా స్పందించిన మండలి ఛైర్మన్ మోషెన్ రాజు... ఇది పెద్దల సభ అని, ఎమ్మెల్యే కంటే ఎక్కువ అడగాలని అన్నారు. ఆ సమయంలో మండలిలో ఉన్న దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు.

ఈ సందర్భంగా ఈ లేఖల విషయంలో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా... గత ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది తన లెటర్ కు కూడా అనుమతి ఇవ్వలేదని, ఆ అనుభవం తనకూ ఉందని వెల్లడించారు. ఇదే సమయంలో టీటీడీ లెటర్స్ విషయంలో ఎమ్మెల్సీలు లేవనెత్తిన అంశాన్ని సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఇక టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ ఎన్ ఫొర్స్ మెంట్ విచారణకు ఆదేశించమని చెప్పిన మంత్రి ఆనం... ఆ విచారణకు సంబంధించి ప్రాథమిక నివేదిక ఇప్పటికే వచ్చిందని, ప్రస్తుతం మరింత లోతైన విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఈ పూర్తిస్థాయి నివేదిక అనంతరం చర్యలుంటాయని వెల్లడించారు.