Begin typing your search above and press return to search.

పల్నాడు హీట్‌: సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఎమ్మెల్సీ మాటల దాడి!

తాజాగా జంగా కృష్ణమూర్తి.. ఎమ్మెల్యే కాసుపై ధ్వజమెత్తారు. జంగా స్వగ్రామమైన దాచేపల్లి మండలం గామాలపాడులో ఫిబ్రవరి 4న ఆసరా చెక్కులు అందివ్వాలని ఎమ్మెల్యే కాసు నిర్ణయించారు.

By:  Tupaki Desk   |   5 Feb 2024 7:33 AM GMT
పల్నాడు హీట్‌: సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఎమ్మెల్సీ మాటల దాడి!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ముందుకు కదులుతున్నారు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో సీట్లు ఆశిస్తున్నవారు ఎక్కువ ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు. తాజాగా పల్నాడు జిల్లా వైసీపీలో లుకలుకలు బయటపడటమే ఇందుకు నిదర్శనమంటున్నారు. పల్నాడు జిల్లాకు ఆయువుపట్టు లాంటి గురజాల నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్‌ రెడ్డి, ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సీటు కోసం పోటీ పడుతున్నారు.

యాదవ సామాజికవర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి గతంలో 1999, 2004ల్లో గురజాల ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ తరఫున గెలుపొందారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జంగాకు వైఎస్‌ జగన్‌ సీటు ఇవ్వలేదు. ఆయనను ఎమ్మెల్సీని చేసి మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేశ్‌ రెడ్డికి గురజాల సీటు ఇచ్చారు. అయితే కాసు మహేశ్‌ రెడ్డి గురజాలకు స్థానికుడు కాదు. అప్పటి నుంచి అడపదడపా జంగా కృష్ణమూర్తి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గురజాల వైసీపీ సీటును జంగా కృష్ణమూర్తి ఆశిస్తున్నారు. సహజంగానే ప్రస్తుతం గురజాల ఎమ్మెల్యేగా ఉన్న కాసు మహేశ్‌ రెడ్డికి జంగా వ్యవహారం రుచించడం లేదని టాక్‌. దీంతో ఇద్దరి మధ్య బేధాబిప్రాయాలు నెలకొన్నాయని చెబుతున్నారు.

తాజాగా జంగా కృష్ణమూర్తి.. ఎమ్మెల్యే కాసుపై ధ్వజమెత్తారు. జంగా స్వగ్రామమైన దాచేపల్లి మండలం గామాలపాడులో ఫిబ్రవరి 4న ఆసరా చెక్కులు అందివ్వాలని ఎమ్మెల్యే కాసు నిర్ణయించారు. గామాలపాడు గ్రామ సర్పంచిగా జంగా కృష్ణమూర్తి కుమారుడు జంగా సురేశ్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో జంగా, ఆయన తనయుడు ఫొటోలు లేకుండా నరసరావుపేట ఎంపీగా పోటీ చేయనున్న అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చిత్రాలతో గ్రామంలో ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డి బ్యానర్లు వేయించారని తెలుస్తోంది.

తమ సొంత ఊరిలోనే తమకు సమాచారం ఇవ్వకపోవడమే కాకుండా బ్యానర్లతో తన ఫొటో, సర్పంచ్‌ అయిన తన కుమారుడి ఫొటో లేకుండా చేసిన ఎమ్మెల్యే కాసుపై జంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 85 శాతం పదవులు ఇచ్చామని గొప్పలు చెబుతున్న ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డి గురజాల సీటు వదిలి నరసరావుపేటకు వెళ్లాలని ఎమ్మెల్సీ జంగా ఎద్దేవా చేశారు. గ్రామాల్లో ఎమ్మెల్యే చిచ్చు రేపడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ పాటించడం లేదని ధ్వజమెత్తారు. దొరలా వ్యవహరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

వాస్తవానికి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేసినప్పుడే జంగా కూడా ఆయన బాటలో వెళ్తారని అంతా భావించారు. అయితే వైసీపీ అధిష్టానం ఇంకా గురజాల టికెట్‌ ఖరారు చేయకపోవడంతో వేచిచూసే ధోరణిలో జంగా ఉన్నారు. మరి పల్నాడు పంచాయతీని జగ¯Œ ఎలా తీరుస్తారో వేచిచూడాల్సిందే.