'మోడల్ చాయ్ వాలీ' వీడియో వైరల్... టీ అమ్ముతూ లక్షల సంపాదన!
తాజాగా ది హంగ్రీ పంజాబీ అనే ఫుడ్ బ్లాగింగ్ ఛానల్ పోస్ట్ చేసిన వీడియోలో... సిమ్రాన్ తన రోడ్ సైడ్ షాప్ పై చాయ్ ను తయారుచేస్తున్న విధానాన్ని చూపిస్తుంది.
By: Tupaki Desk | 9 Oct 2024 4:02 AM GMTమిస్ గోరఖ్ పూర్ 2018 అయిన సిమ్రాన్ గుప్తా ఇప్పుడు "మోడల్ చాయ్ వాలీ" గా నెట్టింట హల్ చల్ చేస్తోంది! వాస్తవానికి మిస్ గోరఖ్ పూర్ గా గెలుపొందిన తర్వాత మోడలింగ్ రంగంలో ఆమెకు అనేక ప్రకటనలు వచ్చినప్పటికీ.. కోవిడ్-19 మహమ్మారి ఆమె పురోగతిని అడ్డుకుందని చెబుతున్నారు.
అవును... ఒక నాటి మోడల్, మిస్ గోరఖ్ పూర్ సిమ్రాన్ గుప్తా ఇప్పుడు మోడల్ చాయ్ వాలీగా మారారు. తాజాగా ది హంగ్రీ పంజాబీ అనే ఫుడ్ బ్లాగింగ్ ఛానల్ పోస్ట్ చేసిన వీడియోలో... సిమ్రాన్ తన రోడ్ సైడ్ షాప్ పై చాయ్ ను తయారుచేస్తున్న విధానాన్ని చూపిస్తుంది. ఈ వీడియోలో ఈ మాజీ అందాల సుందరి చాయ్ ని హుషారుగా చేస్తుండటం కనిపిస్తుంది.
ఈ వీడియో ఆరు రోజుల్లో సుమారు 13 మిలియన్లకు పైగా ఇన్ స్టా గ్రామ్ వ్యూస్ సంపాదించుకోవడంతో పాటు దాదాపు నాలుగున్నర లక్షల లైక్స్ సంపాదించుకొవడం గమనార్హం. ఇలా వైరల్ అవుతున్న వీడియోలో సిమ్రాన్ గుప్తా.. చేస్తున్న చాయ్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరికొంతమంది హెయిర్ వదులుగా ఉండటాన్ని తప్పుబడుతున్నారు.
ఈ క్రమంలో స్పందించిన సిమ్రాన్ గుప్తా... మిస్ గోరఖ్ పూర్ టైటిల్ గెలవడం తనలో మనోధైర్యాన్ని మరింత పెంచిందని.. తాను ఢిల్లీ వెళ్లేలా చేసిందని.. తాను ప్రకటనలో కూడా పనిచేసినట్లు తెలిపారు! అయితే... కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆమె తిరిగి తన స్వస్థలం గోరఖ్ పూర్ కి వచ్చినట్లు పేర్కొన్నారు! ఇక, ఇప్పుడు ఆమె సంపాదన నెలకు రూ. లక్షకు పైగా ఉందని తెలుస్తోంది.