Begin typing your search above and press return to search.

అదానీపై కేసులో ట్విస్ట్.. భారత్ సాయం కోరిన అమెరికా.. మోడీ ఏం చేస్తారు?

ట్రంప్ తో సన్నిహిత సంబంధాలున్న మోడీ తన కు అత్యంత ఆప్తుడిగా ముద్రపడ్డ అదానీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఆసక్తి రేపుతోంది.

By:  Tupaki Desk   |   19 Feb 2025 9:30 AM GMT
అదానీపై కేసులో ట్విస్ట్.. భారత్ సాయం కోరిన అమెరికా.. మోడీ ఏం చేస్తారు?
X

కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపంలా మారింది కేంద్రంలోని మోడీ సర్కార్ పరిస్థితి. ఇప్పుడు మోడీకి సన్నిహితుడిగా ముద్రపడిన గౌతం అదానీ విషయంలో అమెరికా విచారణ జరుపుతుండడంతో నరేంద్రమోడీ ప్రభుత్వం ఎలా ముందుకెళుతుందన్నది ఆసక్తిగా మారింది.. ట్రంప్ తో సన్నిహిత సంబంధాలున్న మోడీ తన కు అత్యంత ఆప్తుడిగా ముద్రపడ్డ అదానీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడన్నది ఆసక్తి రేపుతోంది.

అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) తాజాగా భారత పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ , ఆయన మేనల్లుడు సాగర్ అదానీలపై ఉన్న ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి భారత న్యాయ మంత్రిత్వ శాఖ సహకారాన్ని కోరింది. ఈ ఆరోపణలు ప్రకారం, అదానీ గ్రూప్ అధినేతలు భారత ప్రభుత్వ అధికారులకు $265 మిలియన్ (సుమారు ₹2,200 కోట్లు) లంచం ఇచ్చి, అదానీ గ్రీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ కొనుగోలు చేయించారని, కంపెనీ యొక్క వ్యతిరేక అవినీతి విధానాల గురించి అమెరికా పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించారని పేర్కొంది.

ఎస్‌ఈసీ, న్యూ యార్క్ జిల్లా కోర్టుకు, గౌతమ్ అదానీ, సాగర్ అదానీలకు నోటీసులు అందించేందుకు భారత న్యాయ మంత్రిత్వ శాఖ సహకారాన్ని కోరుతున్నట్లు తెలిపింది, ఎందుకంటే వారు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు. అమెరికా కస్టడీలో లేరు. ఈ వ్యవహారం మోడీ సర్కార్ కు విషపరీక్షగా మారుతుందని విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు.

గత సంవత్సరం, బ్రూక్లిన్‌లోని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు, అదానీ భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చి, అదానీ గ్రీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ కొనుగోలు చేయించారని, కంపెనీ వ్యతిరేక అవినీతి విధానాల గురించి అమెరికా పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను "ఆధారరహితమైనవి" అని ఖండించింది. అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషించనున్నట్లు ప్రకటించింది.

ఈ ఆరోపణలు, అదానీ గ్రూప్ , భారత ప్రభుత్వంపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. అమెరికా ఇప్పుడు భారత్ సాయం కోరడంతో కేంద్రంలోని మోడీ సర్కారు ఎటువంటి అడుగులు వేస్తుందన్నది ఆసక్తిగా మారింది.