నేడు మోడీ పుట్టిన రోజు.. బీజేపీ దేశవ్యాప్తంగా ఏం చేస్తోందంటే!
ప్రధాన మంత్రిగా మూడోసారి అధికారం దక్కించుకుని.. రికార్డు సృష్టించిన నరేంద్ర మోడీ పుట్టిన రోజు నేడు.
By: Tupaki Desk | 17 Sep 2024 4:52 AM GMTప్రధాన మంత్రిగా మూడోసారి అధికారం దక్కించుకుని.. రికార్డు సృష్టించిన నరేంద్ర మోడీ పుట్టిన రోజు నేడు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్‌లో జన్మించిన మోడీ.. నేడు(మంగళవారం) 74 ఏళ్లు పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. అయితే.. గత పుట్టిన రోజులకు ఈ పుట్టిన రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. వరుసగా బీజేపీ మూడోసారి కూడా అధికారంలోకి తీసుకువచ్చిన ఘనతను మోడీనే దక్కించుకు న్నారు. రెండు సార్లు అప్రతిహత మెజారిటీ దక్కించుకున్నారు.
2014, 2019 రెండు సార్లు కూడా.. మోడీ బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు. నిజానికి ఆ ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమి పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లినప్పటికీ.. బీజేపీ ఒంటరిగానే మెజారిటీ దక్కించుకుంది. అయినప్పటికీ.. మిత్రపక్షాలకు మోడీ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక, తాజాగా ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఎన్డీయే పక్షాలతో మోడీ చెలిమి చేశారు. ఇదే ఆయనను గట్టెక్కించింది. మూడోసారి ప్రధాని పీఠం అందుకునేలా చేసింది.
కానీ, మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని మంగళవారం దేశవ్యాప్తంగా బీజేపీ పలు కార్యక్రమాలు నిర్వ హిస్తోంది. సేవా పక్వాడా పేరుతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. ఆ రాష్ట్రం-ఈ రాష్ట్రం అనే తేడా లేకుండా.. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో నిర్వహించే కార్యక్రమా లు.. ఒక వారం రోజుల పాటు దేశంలో కొనసాగనున్నాయి. వైద్య శిబిరాలతో పాటు పలు సేవలు చేయనున్నారు. ఏపీ, తెలంగాణల్లో అయితే.. మరింత ఎక్కువగానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇక, దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.. వరుసగా ఈ దేశానికి మూడు సార్లు ప్రధాన మంత్రిగా చేసిన రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే.. ఇప్పుడు మూడోసారి కూడా విజయం దక్కించుకోవడంతో నరేంద్ర మోడీ ఈ రికార్డును తిరగరాశారు. అంతేకాదు.. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడంలోనూ మోడీ కీలక రోల్ పోషించారు. కాదనుకున్న పార్టీలను ఏకం చేయడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు తనను తిట్టిన వారిని కూడా ఆయన చేరువ చేసుకున్న తీరు ఎన్నికల్లో ఆయనకు విజయం అందించింది.