Begin typing your search above and press return to search.

నాలుగోసారి అంటున్న మోడీ... లెక్క సరిపోతుందా ?

కేంద్రంలో నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యారు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 3:28 AM GMT
నాలుగోసారి అంటున్న మోడీ... లెక్క సరిపోతుందా ?
X

కేంద్రంలో నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యారు. అది కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చి కాదు. ఎన్డీయే మిత్రుల చలువతోనే. బీజేపీకి ఈసారి ఎన్నికల్లో ఉత్తరాదిన ఆదరణ బాగా తగ్గింది. గుండెకాయ లాంటి యూపీ బీజేపీకి హ్యాండ్ ఇచ్చింది. అక్కడ మొత్తం 80 సీట్లు వుంటే బీజేపీకి దక్కినవి 33 మాత్రమే.

మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ సహా చాలా చోట్ల డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ నేపధ్యంలో మోడీ ముంబై పర్యటనలో తాజాగా కీలక కామెంట్స్ చేశారు. ఆయన గ్లోబెల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో మాట్లాడుతూ బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదని ఎదురు దెబ్బలు తిన్నదని అంటున్నారని కానీ 2029 నాటి ఎన్నికల్లో గెలిచి మళ్లీ ఫిన్ టెక్ ఫెస్ట్ కి తానే ముఖ్య అతిధిగా వస్తాను అని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు

తాను ప్రజాదరణ కోల్పోతున్నాను అని కొందరు రాజకీయ విశ్లేషణలు చేయడం పట్ల ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు అని అంటున్న వారికి ఈ విధంగా మోడీ సవాల్ విసిరారు. అంతే కాదు తన ప్రజాదరణ తగ్గలేదని ఆయన అంటున్నారు.

ఇంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ విధంగానే చెప్పారు. 2029లోనూ బీజేపీదే అధికారం అన్న మాట ఆయన అన్నారు. అపుడు కూడా మోడీ ప్రధాని అన్నారు. ఇపుడు మోడీ స్వయంగా ఈ మాటలు అన్నారు. దీనిని బట్టి మోడీ ఏకంగా రెండు దశాబ్దాల పాటు దేశానికి ప్రధానిగా ఉండాలని పాత రికార్డులు తిరగరాయాలని గట్టి పట్టుదలగా ఉన్నారు అని అర్ధం అవుతోంది.

మోడీ ఈ టెర్మ్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసినా మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ పండిట్ నెహ్రూ రికార్డులను దాటలేరు. ఎందుకంటే ఇందిరాగాంధీ 16 ఏళ్ళు, నెహ్రూ పదిహేడేళ్ళు పాలించారు. మోడీ వారి రికార్డు బద్ధలు కొట్టాలీ అంటే 2029లో కూడా ప్రధాని కావాల్సిందే. ఆ టెర్మ్ కూడా పూర్తి చేస్తే ఆయన కచ్చితంగా నెహ్రూ ఫ్యామిలీ రికార్డుని బద్ధలు కొడతారు, అలాగే దేశంలో ఏ ప్రధాని పాలించని విధంగా ఎక్కువ సార్లు పాలించిన క్రెడిట్ దక్కించుకుంటారు. అంతే కాదు సమీప భవిష్యత్తులో ఎవరు కూడా మోడీ రికార్డుని బ్రేక్ చేయలేని స్థితికి చేరుకుంటారు.

అందుకే మోడీ అలా అన్నారని అంటున్నారు. అయితే మోడీ ఆశలకు అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయన్నది కూడా ఆలోచిస్తున్నారు. మోడీ ఇండియా కూటమిని పోటీ కాదు అనుకుంటున్నారా లేక రాహుల్ గాంధీ తనకు సమ ఉజ్జీ కారని లెక్క వేస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. ప్రధాని రేసులో ఉన్న వారిలో అందరూ కూడా ఇపుడు ఇబ్బంది పడుతున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ట్రైనీ వైద్యురాలి హత్యాచారం ఘటనతో పూర్తిగా ఇరుకున పడ్డారు.

ఇక ఇండియా కూటమిలో కూడా చాలా మంది లీడర్లు ఉన్నా కూడా బీజేపీయే ఈ రోజుకీ అతి పెద్ద బలమైన పార్టీ. కాంగ్రెస్ సెంచరీ సీట్లను సాధించలేకపోయింది. రానున్న కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో పూర్తి ఆధిపత్యం సాధించగలమని బీజేపీ నమ్ముతోంది.

అలాగే కేరళలో మరిన్ని సీట్లు గెలుస్తామని లెక్క వేసుకుంటోంది. స్టాలిన్ ప్రభ తగ్గిన తమిళనాడులో కూడా పాగా వేస్తామని ధీమా పడుతోంది. ఒడిశా ను జయించిన బీజేపీకి పోటీ లేదు. పశ్చిమ బెంగాల్ లోనూ ఎదురు లేని పరిస్థితి ఫ్యూచర్ లో ఉండొచ్చు అని కూడా భావిస్తోంది.

మహారాష్ట్రలో కూడా శివసేన బీటలు వారింది. శరద్ పవార్ వచ్చే ఎన్నికల నాటికి మరింత వృద్ధుడు అవుతారు కాబట్టి అక్కడా తమ చక్రం తిరగవచ్చు అని భావిస్తోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రభ కూడా జైలు గోడల మధ్య తగ్గిపోయింది. దీంతో రాహుల్ గాంధీ తప్ప ఎవరూ ప్రత్యర్థిగా లేరు అన్నదే బీజేపీ ధీమా. అందుకే ఇండియా కూటమిని లైట్ తీసుకుంటోందని అంటున్నారు చూడాలి మరి మోడీ తనకు ప్రజాదరణ ఉంది అని అంటున్నారు. చూడాలి రానున్న రోజులలో ఎలా ఉంటుందో.