Begin typing your search above and press return to search.

కాశ్మీర్ లో పవర్...మోడీ కాన్ఫిడెన్స్ వెనక ?

కాశ్మీర్ ని ఏలాలని బీజేపీకి కోరిక. అది దశాబ్దాల నాటిది. మొత్తం భారత దేశనికి తిలకంగా ఉండే ప్లేస్ లో కాశ్మీర్ ఉంటుంది.

By:  Tupaki Desk   |   29 Sep 2024 3:35 AM GMT
కాశ్మీర్ లో పవర్...మోడీ కాన్ఫిడెన్స్ వెనక ?
X

కాశ్మీర్ ని ఏలాలని బీజేపీకి కోరిక. అది దశాబ్దాల నాటిది. మొత్తం భారత దేశనికి తిలకంగా ఉండే ప్లేస్ లో కాశ్మీర్ ఉంటుంది. యాపిల్స్ కి పెట్టింది పేరు. పర్యాటకానికి కేరాఫ్ అడ్రస్. వ్యూహాత్మకంగా ప్రాంతం. అలాగే దేశం మొత్తానికే ఒక అందమైన యాపిల్ లాంటి ప్రాంతం.

అలాంటి కాశ్మీర్ ని ఏలాలని ఎవరికి ఉండదు, బీజేపీకి అయితే ఇంకా ఉంటుంది. బీజేపీ దేశాన్ని జయించింది కానీ కాశ్మీర్ ని అందుకోలేకపోతోంది. ఇక 2019లో 370 ఆర్టికల్ ని రద్దు చేసి కాశ్మీర్ లో గవర్నర్ ద్వారా పరోక్ష పాలన సాగించింది.

ఇపుడు ప్రజల ఓట్లతో తొలిసారి అధికారంలోకి రావాలని చూస్తోంది. ఇక కాశ్మీర్ లో రాజకీయం చూస్తే బీజేపీకి అందకుండానే ఉంది. పైగా మొత్తం 90 సీట్లకు గానూ బీజేపీ పోటీకి పెట్టిందే 62 చోట్ల మాత్రమే. ఇందులో నుంచే మ్యాజిక్ ఫిగర్ 46 రావాలి. అంటే దాదాపుగా పోటీ చేసిన అన్నీ గెలవాలి.

ఆ అద్భుతం బీజేపీ వల్ల సాధ్యమా అన్నది చర్చ. జమ్మూలో అయితే బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని అంటున్నారు. కానీ కాశ్మీర్ లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ ప్లస్ కాంగ్రెస్ కూటమిదే పై చేయి అని అంటున్నారు. అక్కడే ఎక్కువ సీట్లు ఉన్నాయి. మొత్తం 47 సీట్లలో కూటమి తొంబై శాతం పైగా గెలుచుకున్నా అధికారం వారిదే. జమ్మూలో కాంగ్రెస్ కి సీట్లు వస్తాయని అంటున్నారు ఈ లెక్కన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వారు ధీమాగా ఉన్నారు

అయితే మోడీ మాత్రం ఈ లెక్క తప్పు అని అంటున్నారు జమ్మూ కాశ్మీర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన చెబుతున్నారు. తాజాగా జమ్ములో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మొదటి రెండు విడతల అనంతరం జరిగిన పోలింగ్ సరళిని పరిశీలించి మొదటిసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయంగా కనిపించిందని తనదైన జోస్యాన్ని చెప్పారు

అదే సమయంలో తన రాజకీయ ప్రత్యర్ధి పార్టీలు అయిన కాంగ్రెస్ , దాని భాగస్వామ్య పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ సారథ్యంలో పీడీపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఈ మూడు పార్టీలు అవినీతి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అందుకే గత రెండు విడతల్లో ప్రజలు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని మోడీ అంచనా కట్టారు.

వీటిని చూసిన మీదటనే బీజేపీ గెలుపు తథ్యంగా కనిపిస్తోందని ఆయన అంటున్నారు. జమ్ముకశ్మీర్‌లోని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీల కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోయారని వారు ఇప్పుడు ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని అందుకే కమలానికే ఓటు వేస్తున్నారని మోడీ అంటున్నారు.

జమ్మూ కాశ్మీర్ లో ఇక అవినీతి, ఉద్యోగాల్లో వివాదం తిరిగి చోటుచేసుకోరాదని, వేర్పాటువాదం, రక్తపాతానికి ఇంకెంత మాత్రం లేదని ప్రజలు స్పష్టమైన తీర్పుని ఇస్తున్నారు అని ఆయన అంటున్నారు. అదే సమయంలో సరిహద్దు ఉగ్రవాదంపై సర్జికల్ దాడులతో ప్రపంచానికి తాము స్పష్టమైన సందేశం ఇచ్చామని కూడా మోడీ చెబుతున్నారు.

ఇలా మోడీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల మీద ధీమాగా ఉన్నారు. జమ్మూలో బీజేపీకి కనీసం 35 దాకా సీట్లు వస్తే ఆ మిగిలిన పదకొండు సీట్లను ఏదో విధంగా సాధించి అయినా పీఠం ఎక్కాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది అని అంటున్నారు. దానికి తోడు వలస పోయిన కాంశ్మీర్ పండింట్లు 40 శాతం మంది ఓటు హక్కుని వినియోగించుకున్నారని అది బీజేపీకే అని ఆ పార్టీ లెక్క వేసుకుంటోంది. చూడాలి మరి అక్టోబర్ 7న ఫలితాలు ఏ విధంగా వస్తాయో.