Begin typing your search above and press return to search.

"ఫోకస్ ఆన్ ఇండియా"... భారత్ కు జర్మనీ భారీ గుడ్ న్యూస్!

ఈ విషయాన్ని తాజాగా మోడీ వెల్లడించారు. "ఫోకస్ ఆన్ ఇండియా" పేరిట ఒక పత్రాన్ని విడుదల చేసిందని అన్నారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 8:30 PM GMT
ఫోకస్  ఆన్  ఇండియా... భారత్  కు జర్మనీ భారీ గుడ్  న్యూస్!
X

18వ ఆసియా ఫసిఫిక్ కాన్ ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ లో ప్రధాని మాట్లాడుతూ.. రాబోయే 25ఏళ్లకు వికసిత్ భారత్ కోసం రోడ్ మ్యాప్ రూపొందించామని తెలిపారు. ఈ సందర్భంగా.. ఓ గుడ్ న్యూస్ వెల్లడించారు. ఇందులో భాగంగా... నైపుణ్యం కలిగిన భారత శ్రామిక శక్తి కోసం వీసాల సంఖ్యను పెంచిందని ప్రధాని మోడీ తాజాగా వెల్లడించారు.

అవును... భారతీయ కార్మికులకు ఇచ్చే స్కిల్డ్ లేబర్ వీసాలను భారీగా పెంచుతూ జర్మనీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో కేవలం 20,000 గా ఉండే నైపుణ్యం కలిగిన లేబర్ వీసాల సంఖ్యను ఏటా 90,000 పెంచిది. ఈ విషయాన్ని తాజాగా మోడీ వెల్లడించారు. "ఫోకస్ ఆన్ ఇండియా" పేరిట ఒక పత్రాన్ని విడుదల చేసిందని అన్నారు.

ఇదే క్రమంలో... భారత శ్రామిక శక్తిపై జర్మనీ ఉంచిన విశ్వాసం అద్భుతమని.. ఈ నిర్ణయం ఆ దేశ వృద్ధికి దోహదం చేస్తుందని మోడీ తెలిపారు. ఈ సందర్భంగా భారత్, జర్మనీ భాగస్వామ్యం కేవలం లావాదేవీలకే పరిమితం కాదన్ని.. రెండు బలమైన ప్రజాస్వామిక పరివర్తన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని మోడీ వెల్లడించారు.

ఇదే సమయంలో... ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న ఉద్రిక్తతలు, అనిశ్చితిలో ఉన్న సమయంలో ఇరు దేశాల వ్యూహాత్మక బంధం బలోపేతమవుతోందని చెప్పిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. శాంతి కోసం భారత్ సాధ్యమైనంత సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని అన్నారు.

ప్రధానంగా... భారతదేశపు డైనమిక్స్, జర్మనీ ఖశ్చితత్వం కలిసినప్పుడు.. భారతదేశపు ఆవిష్కరణలు, జర్మనీ ఇంజినీరింగ్ కలిసినప్పుడు.. ఇండో – పసిఫిక్ మొత్తం ప్రపంచానికి మంచి భవిష్యత్తు నిర్ణయించబడుతుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా... ఫెడరల్ లేబర్ మినిస్ట్రీ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి జర్మనీలో సుమారు 1.37 లక్షల మంది భారతీయులు స్కిల్ జాబుల్లో పనిచేస్తున్నరని తెలిపింది.