రష్యా-ఉక్రెయిన్ వార్... సమస్య పరిష్కారానికి మోడీ సలహా ఇదే!
ఈ సమయంలో ఇరు దేశాలతో సన్నిహిత సంబంధాలున్న భారత్ ఈ విషయంలో కీలక భూమిక పోషించబోతున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 22 Oct 2024 3:01 PM GMTరష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం అవిరామంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య జోక్యం చేసుకుని సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకునేవారు కరువయ్యారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇరు దేశాలతో సన్నిహిత సంబంధాలున్న భారత్ ఈ విషయంలో కీలక భూమిక పోషించబోతున్నట్లు తెలుస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ముగింపు లేనట్లుగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇరుదేశాలూ ప్రాణ, ఆస్థి నష్టాలు చవిచూస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ బయటకు చెప్పుకుంటుంది.. రష్యా చెప్పుకోవడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రష్యాలోని కజాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడీకి సాదర స్వాగతం లభించింది. ఈ సందర్భంగా మోడీ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఆయా ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇందులో భాగంగా... బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సమావేశం కోసం అందమైన కజాన్ నగరాన్ని సందర్శించినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపిన ప్రధాని మోడీ... రష్యాతో భారతదేశానికి చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా... రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని ఉటంకిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... వివాదాలకు శాంతియుత పరిష్కారాలను భారత్ విశ్వసిస్తుందని.. చర్చలతో అన్ని సమస్యలూ పరిష్కారం అవుతాయనేది తమ వైఖరి అని మోడీ అన్నారు. ఈ సందర్భంగా బ్రిక్స్ లో చేరతామనే ఇతర దేశాల కోరికతో కూటమి సక్సెస్ అవ్వడంపై సభ్యదేశాలకు శుభాకాంక్షలు చెప్పారు.
కాగా.. "బ్రిక్స్" కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఇందులో మోడీ, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తో పాటు ఇతర నేతలు పాల్గొంటారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో ఏర్పాటైన ఈ కూటమిని విస్తరించి.. ఈజిప్ట్, ఇరాన్, సౌదీ అరేబియా, ఇథియోపియా, యూఏఈ లకు సభ్యత్వం ఇచ్చారు. ఇలా కూటమిని విస్తరించిన తర్వాత జరుగుతున్న తొలి శిఖరాగ్ర సదస్సు ఇది!