Begin typing your search above and press return to search.

ఫెస్టివల్ స్పెషల్ : మోడీతో మెగాస్టార్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి దేశ పెద్ద ప్రధాని అయిన నరేంద్ర మోడీతో కలసి ఒకే వేదికను పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   13 Jan 2025 8:56 PM GMT
ఫెస్టివల్ స్పెషల్ : మోడీతో మెగాస్టార్
X

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి దేశ పెద్ద ప్రధాని అయిన నరేంద్ర మోడీతో కలసి ఒకే వేదికను పంచుకున్నారు. దీనిని ఢిల్లీ కేంద్ర బిందువు అయింది. తెలంగాణాకు చెందిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఢిల్లీలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిధిగా నరేంద్ర మోడీని ఆహ్వానించారు, అదే సమయంలో ప్రత్యేక అతిధిగా మెగాస్టార్ చిరంజీవిని ఇన్వైట్ చేసారు.

దీంతో పండుగ వేళ మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీ వెళ్లారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో కలసి అక్కడ సంక్రాంతి సంబరాలలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేస్తే ఆ తరువాత అవకాశం చిరంజీవికి దక్కింది. ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రధాని తో కలసి వేదిక మీదకు వచ్చారు.

అలా మోడీ మెగాస్టార్ ఈ సారి సంక్రాంతి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిజానికి చూస్తే ఇదేమీ రాజకీయ సందర్భం కాదు, పైగా పండుగలు అంతే కల్చరల్ ఈవెంట్స్ గా చెప్పుకుంటారు. అయితే రెండు రాష్ట్రాలలోని తెలుగు రాజకీయాలు చూస్తే కనుక ఏపీలో టీడీపీ కూటమిలో జనసేన బీజేపీ కలసి మిత్రులుగా ఉన్నాయి.

అలాగే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి జనసేన టీడీపీ మద్దతు ఇస్తున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పైపెచ్చు ప్రధానికి ఆయన అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఆయన సోదరుడిగానే కాదు టాలీవుడ్ పెద్దగా ఉన్న మెగాస్టార్ ప్రధానితో వేదిక పంచుకోవడం అన్నది ఇది తొలిసారి కాకపోయినా ఒక ప్రత్యేక అటెన్షన్ అయితే ఈ ఈవెంట్ మీద ఉంది.

దీని కంటే ముందు ఏడు నెలల క్రితం ఏపీలో ఏర్పాటు అయిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఆనాడు మెగాస్టార్ కూడా పాల్గొన్నారు. వేదిక మీద పవన్ కళ్యాణ్ మెగాస్టార్ ల చేతులు పట్టుకుని పైకి లేపి ఆ ఇద్దరితో తన సాన్నిహిత్యాన్ని మోడీ అలా చాటుకున్నారు.

ఆ తరువాత ఇపుడు ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో మళ్లీ మోడీ చిరంజీవి కలుసుకున్నారు. చిరంజీవి రాజకీయాలను వదిలేసారు. కానీ ఆయన రాజకీయ కార్యక్రమాల్లో మాత్రం అరుదుగా కనిపిస్తుంటారు. ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్ లో అయితే తప్పనిసరిగా ఉంటారు. పైగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో చిరంజీవికి ప్రత్యేక అనుబంధం ఉంది. దాంతోనే ఆయన మెగాస్టార్ ని ఢిల్లీకి స్పెషల్ గెస్ట్ గా గౌరవించి పిలిపించారు. మొత్తం మీద చూస్తే ఈసారి సంక్రాంతి ఫెస్టివల్ కి మోడీ మెగాస్టార్ మీట్ అన్నది వెరీ స్పెషల్ గానే ఉందని అంటున్నారు. సంక్రాంతి పండుగ వేడుకకు ఇది మరో పై మెట్టు ఈవెంట్ గా కూడా అంతా చూస్తున్నారు.