మోడీని కొనియాడిన పోలాండ్ మంత్రి... చేసిన మాట సాయం ఏమిటంటే..?
ఇదే సమయంలో... యుద్ధం ముగింపు కోసం జరుగుతోన్న శాంతి ప్రయత్నాల్లో నరేంద్ర మోడీ తన వంతు కృషి చెస్తున్నారు.
By: Tupaki Desk | 18 March 2025 2:00 AM ISTఅవిరామంగా జరుగుతోన్న రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... మంగళవారం పుతిన్ తో ఫోన్ లో చర్చలు జరపనున్నారు. ఇదే సమయంలో... యుద్ధం ముగింపు కోసం జరుగుతోన్న శాంతి ప్రయత్నాల్లో నరేంద్ర మోడీ తన వంతు కృషి చెస్తున్నారు.
అవును.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం జరుగుతోన్న ప్రయత్నాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనవంతు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పోలాండ్ విదేశాంగ శాఖ సహాయమంత్రి వ్లాడిస్లా టియోఫిల్ బార్డోషెష్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా... ఈ సమయంలో భారత్ గొప్ప మాట సాయం చేసిందని కొనియాడారు.
ఉక్రెయిన్ పై అణు వ్యూహాత్మక ఆయుధాలు వాడకుండా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ను భారత ప్రధాని మోడీ ఒప్పించారని బార్డోషెష్కీ వెల్లడించారు. ఈ సందర్భంగా... మోడీ పోలాండ్ రాజధాని వార్సా పర్యటన తమకు ఎంతో ఉపయోగపడిందని.. తాము శాశ్వత, సుస్థిరశాంతిని కోరుకుంటున్నామని మీడియాతో అన్నారు.
తాజాగా అమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు లెక్స్ ఫ్రీడ్ మాన్ కు ఇచ్చిన పాడ్ కాస్ట్ ముఖాముఖిలో మోడీ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు సాధ్యమైనప్పుడే వాటి మధ్య గల వివాదానికి పరిష్కారం లభిస్తుందని.. యుద్ధక్షేత్రంలో ఎప్పటికీ పరిష్కారం దొరకదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో... రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా లేదని.. శాంతికి బలంగా కట్టుబడి ఉందని.. తనకు అటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇటు ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీతో సంత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.
మరోపక్క ఉక్రెయిన్-రష్యా యుద్ధం వ్యవహారంలో అమెరికా చాలా వేగంగా నిర్ణయాలు తీసుకొంటోంది. దీనిపై స్పందించిన ట్రంప్... తాను మంగళవారం పుతిన్ తో చర్చలు అజ్రగపునున్నానని.. తాము భూమి, పవర్ ప్లాంట్ల గురించి కూడా చర్చించుకున్నామని.. కొన్ని ఆస్తులను రష్యా-ఉక్రెయిన్ మధ్య విడదీయడంపై ఇప్పటికే మాట్లాడానని అన్నారని రాయిటర్స్ వెల్లడించింది.