Begin typing your search above and press return to search.

119 గదులున్న భవనంలో మోడీకి బస... ఏమిటీ గెస్ట్ హౌస్ స్పెషాలిటీ?

ఈ సందర్భంగా అమెరికాలో మోడీ బస ఎక్కడ.. ఏమిటి దాని ప్రత్యేకత అనే చర్చ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   13 Feb 2025 1:10 PM GMT
119 గదులున్న భవనంలో  మోడీకి బస... ఏమిటీ గెస్ట్  హౌస్  స్పెషాలిటీ?
X

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా అమెరికా పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన వాషింగ్టన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా.. మోడీకి భారత సంతతి వారు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమెరికాలో మోడీ బస ఎక్కడ.. ఏమిటి దాని ప్రత్యేకత అనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ వాషింగ్టన్ డీసీ చేరుకొన్నారు. అక్కడ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో పాటు.. ప్రపంచ కుబేరుడు, డోజ్ అధిపతి అయిన ఎలాన్ మస్క్ తో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ప్రపంచంలోనే అత్యంత స్పెషల్ గెస్ట్ హౌస్ లో బస చేస్తున్నారు. అదే... 1651 పెన్సిల్వేనియా అవెన్యూలోని ‘బ్లేయర్ హౌస్’.

దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయని చెబుతారు. అమెరికాలో పర్యటించే ప్రత్యేకమైన ఆతిథులకు ఇక్కడ బస ఏర్పాటు చేస్తారు. వైట్ హౌస్ కు ఎదురుగా ఉండే ఈ గెస్ట్ హౌస్ గతంలో చాలా మంది దేశాధ్యక్షులు, రాజ కుటుంబ సభ్యులకు విడిదిగా వాడారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడే బస చేయనున్నారు.

ఇందులో మొత్తం 119 గదులుండగా.. వాటిలో 14 బెడ్రూమ్ లు, 35 బాత్ రూమ్ లు, మూడు డైనింగ్ రూమ్ లు ఉన్నాయి. ఇదే సమయంలో అమెరికా చరిత్రను తెలిపే పురాతన వస్తువులు, ఆర్ట్స్ తో దీన్నీ అలంకరించారు. ఇందులో అత్యాధునిక బ్యూటీ సెలూన్ కూడా ఉంది. ఇది విలాసవంతమైన గెస్ట్ హౌస్ మాత్రమే కాదు.. అమెరికా ఆతిథ్యానికి చిహ్నంగా చెబుతారు.

సుమారు 70 వేల చదరపుటడుగుల్లో నాలుగు భవనాలు అనుసంధానమై ఉండటం దీనికున్న మరో ప్రత్యేకత. ఇక ఈ భవనాలను 1824లో నిర్మించగా.. 1837లో ప్రెస్టోన్ ఫ్రాన్సిస్ బ్లేయర్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఈ గెస్ట్ హౌస్ కు ఆయన పేరే పెట్టారు.

ఈ క్రమంలో.. 1942లో అమెరికా ప్రభుత్వం ఈ బ్లెయర్ హౌస్ ను అద్దెకు తీసుకొంది. ఆ ఏడాది చివరి నాటికి 1.56 లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది.