Begin typing your search above and press return to search.

'అంతరిక్ష రంగానికి శుభవార్త'... "బాస్" గురించి వెళ్లడించిన ప్రధాని!

ఈ మేరకు తాజాగా భారతీయ విజాన సమ్మేళన్ లో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఈ మేరకు భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్) పై కీలక ప్రకటన చేశారు.

By:  Tupaki Desk   |   18 Sep 2024 2:51 PM GMT
అంతరిక్ష రంగానికి శుభవార్త... బాస్ గురించి వెళ్లడించిన ప్రధాని!
X

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.) గురించి తెలిసిందే. ఈ కేంద్రాన్ని అమెరికా, రష్యా, జపాన్, కెనడా, ఐరోపా దేశాలకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ సమయంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది.

అవును... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు తాజాగా భారతీయ విజాన సమ్మేళన్ లో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ ఈ మేరకు భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్) పై కీలక ప్రకటన చేశారు.

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇస్రోకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా... చంద్రయాన్-4, భారతీయ అంతరిక్ష స్టేషన్, వీనస్ మిషన్, మొదలైన ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా గతంలోనే ఈ విషయాలపై స్పందించిన సోమనాథ్... ప్రస్తుతం ఉన్న లాంఛర్ సామర్థ్యాలతోనే 2028కల్ల మనదేశ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. భారత్ తో పాటు ఇతర దేశాలు, పలు సంస్థలు సైతం ప్రయోగాలు నిర్వహించేందుకు వీలుగా దీన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

తాజాగా ఈ విషయంపై ఎక్స్ లో స్పందించిన ప్రధాని... “అంతరిక్ష రంగానికి శుభవార్త! గగన్ యాన్ కార్యక్రమాన్ని విస్తరిస్తూ భారతీయ అంతరిక్ష్ స్టేషన్ (బీఏఎస్) దిశగా తొలి అడుగు వేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది!.. ఈ మైలురాయి నిర్ణయం మనల్ని 2035 నాటికి స్వయం-స్థిరమైన అంతరిక్ష కేంద్రానికి, 2040 నాటికి క్రూడ్ లూనార్ మిషన్ కు చేరువ చేస్తుంది!" అని పేర్కొన్నారు!

కాగా... ప్రస్తుతం అంతరిక్షంలో రెండు స్పేస్ స్టేషన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి.. అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్.). ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా ఇక్కడకు వచ్చి పరిశోధనలు చేస్తున్నారు. ఇక రెండొవది చైనాకు చెందిన స్పేస్ స్టేషన్. ఈ క్రమంలోనే త్వరలో భారత్ కి కూడా స్పేస్ స్టేషన్ ఉండనుందన్నమాట!