ట్రంప్ చెప్పిన మోడీ జర్నీ డేట్ ఫిక్స్
మోడీ అమెరికా టూర్ షెడ్యూల్ పక్కా అయ్యింది. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ తో భేటీకి డేట్ ఫిక్స్ అయ్యింది.
By: Tupaki Desk | 4 Feb 2025 4:38 AM GMTకాకతాళీయం అనుకోవాలా? ఇంకేమైనా? అమెరికాలో అక్రమంగా ఉన్న మనోళ్లను భారత్ కు ప్రత్యేక విమానంలో పంపిస్తున్న వేళ.. ప్రధాని మోడీ అమెరికా టూర్ షెడ్యూల్ ఫైనల్ కావటం గమనార్హం. కొద్ది రోజుల క్రితం వైట్ హౌస్ లోని మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి రెండోవారంలో భారత ప్రధాని మోడీ అమెరికాకు వస్తున్నారని.. తామిద్దరం భేటీ అవుతున్నట్లుగా స్వయంగా చెప్పటం తెలిసిందే. తాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్ మాట్లాడినట్లుగా ప్రధాని మోడీ వెల్లడిస్తే.. ఫిబ్రవరిలో రెండో వారంలో మోడీ అమెరికాకు వస్తున్నట్లుగా ట్రంప్ పేర్కొన్నారు.
అన్నట్లే.. మోడీ అమెరికా టూర్ షెడ్యూల్ పక్కా అయ్యింది. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ తో భేటీకి డేట్ ఫిక్స్ అయ్యింది. రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ అమెరికాకు వెళుతున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 10న పారిస్ లో జరిగే ఏఐ సదస్సులో పాల్గొనేందుకు మోడీ వెళుతున్నారు. అక్కడే 11వ తేదీ కూడా అక్కడే ఉంటున్నారు.
అనంతరం పారిస్ నుంచి అమెరికాకు మోడీ వెళ్లనున్నారు. ఫిబ్రవరి 12న వాషింగ్టన్ డీసీకి చేరుకోనున్న మోడీ.. 13న ట్రంప్ తో భేటీ అవుతారని భావిస్తున్నారు. అయితే.. మోడీ పర్యటనకు సంబంధించిన అధికారిక సమాచారం లేప్పటికీ.. అనధికారికంగా మాత్రం షెడ్యూల్ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అక్రమ వలసదారుల విషయంలో ట్రంప్ కఠినంగా ఉండటమే కాదు.. తాము గుర్తించిన వారిని ఆయా దేశాలకు తిరిగి పంపేస్తున్నారు.
ఈ క్రమంలో ఒక విమానం (సీ12) విమానంలో అక్రమంగా వలస ఉన్న భారతీయుల్లో పలువురిని ఈ విమానంలో పంపారు. ఇదే సమయంలో మోడీ అమెరికా ట్రిప్ షెడ్యూల్ కావటం ఆసక్తికరంగా మారింది. మోడీ తాజా పర్యటనతో చోటు చేసుకునే పరిణామాలు..ట్రంప్ స్పందనలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఆ దేశాన్ని సందర్శిస్తున్న అతి కొద్ది మంది ముఖ్యనేతల్లో మోడీ ఒకరు కావటం గమనార్హం.