ఏపీ మీద మోడీ అమిత్ షా భారీ స్కెచ్ !
ఏపీలో అధికారంలోకి ఎన్డీయే కూటమి రావాలని మోడీ అమిత్ షా గట్టి నిశ్చయం చేసుకున్నారు అని అర్ధం అవుతోంది.
By: Tupaki Desk | 6 May 2024 2:59 PM GMTఏపీలో ఈసారి అధికారం దక్కించుకోవాలని టీడీపీ ఆరాటపడుతోంది. చివరి నిమిషంలో ఆ పార్టీతో జట్టు కట్టిన బీజేపీ ఏపీ ఎన్నికల్లో కీలక మలుపు దగ్గర తనదైన మాస్టర్ స్కెచ్ ని గీస్తోంది. ఏపీలో అధికారంలోకి ఎన్డీయే కూటమి రావాలని మోడీ అమిత్ షా గట్టి నిశ్చయం చేసుకున్నారు అని అర్ధం అవుతోంది. ఏపీలో జనా మూడ్ చూస్తే హోరా హోరీగా ఫైట్ ఉంటుందన్న సంకేతాలు ఉన్నాయి.
అయితే పోలింగ్ కి వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండి డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే ఈ వారం రోజులే అని అంతా నమ్ముతారు. ఈ కీలక టైం లో రంగంలోకి దిగిన బీజేపీ పెద్దలు గేమ్ చేంజర్ గా బీజేపీని నిలబెడుతున్నారు. ఏపీలో కొత్తగా వచ్చే ప్రభుత్వంలో బీజేపీకి అత్యంత కీలక పాత్ర కావాలన్నది కూడా బీజేపీ పెద్దల ఆశగా కనిపిస్తోంది.
దాంతో పాటు జనసేన తమ మిత్రపక్షంగా ఉందని ఆ పార్టీకి లభించే సీట్లతో పాటు తమకు లభించే అసెంబ్లీ సీట్లతో ఎన్డీయే ప్రభుత్వంగా ఏపీలో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఈ కూటమికి పెద్దన్నగా టీడీపీ ఉన్నప్పటికీ తాము కూడా ముఖ్య భూమిక పోషించాలన్నదే బీజేపీ పెద్దల ఎత్తుగడగా చెబుతున్నారు.
ఏపీలో చూస్తే కనుక టీడీపీ 144 సీట్లకు పోటీ చేస్తోంది. జనసేన 21, పది సీట్లలో బీజేపీ పోటీలో ఉంది. ఈ 31 సీట్లలో కనీసంగా పదిహేను నుంచి ఇరవై సీట్లు సాధించినా ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం తమదేనని చెప్పుకోవచ్చు అన్నదే బీజేపీ వ్యూహకర్తల ఆలోచనగా చెబుతున్నారు. ఇక టీడీపీకి సోలోగా మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు రాకపోతే బీజేపీ పెద్దల వ్యూహం మరింతగా రాటుతేలుతుందని కూడా అంటున్నారు. లేదా బొటా బొటీ మెజారిటీతో టీడీపీ ఉన్నా కూడా కూటమిలో తాము కూడా ప్రాధాన్యత కలిగిన పాత్ర పోషిస్తామని ధీమాగా ఉన్నారు.
ఏపీలో కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అన్న నినాదం వెనక సీక్రెట్ ఇదే అని అంటున్నారు. అదే 2014లో ఏపీలో టీడీపీ కేంద్రంలో బీజేపీ అన్న స్లోగన్ ని వినిపించేవారు. మారిన పరిస్థితుల్లో టీడీపీ రాజకీయ అవసరాలు ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణం, రెండు ప్రాంతీయ పార్టీల మధ్య సాగుతున్న భీకర పోరులో బీజేపీ ఇపుడు తనదైన రాజకీయ పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉందని అంటున్నారు.
ఒక్క రోజు తేడాలో ఏపీకి వచ్చిన బీజేపీ అగ్రే నేతలు నరేంద్ర మోడీ అమిత్ షాలు ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విరుచుకుపడిన తీరు బీజేపీ వ్యూహానికి అద్దం పడుతోంది అని అంటున్నారు. ఏపీలో వైసీపీని గద్దె దించాలన్న పట్టుదల బీజేపీ పెద్దలలో కనిపిస్తోంది అని అంటున్నారు.
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ప్రతిపక్షం వైపు నెట్టడం ద్వారా టీడీపీతో పాటు జనసేన బీజేపీ అధికారంలో పాలు పంచుకొవాలని చూస్తున్నట్లుగా మొత్తం ఎపిసోడ్ చూస్తే అర్ధం అవుతోంది.ఏపీలో ఈసారి అధికారం దక్కడం అతి ముఖ్యంగా భావిస్త్నన్ టీడెపీఎకి మిత్రులతో సర్దుకుని పోవడం కూడా అనివార్యంగా ఉంది. దాంతో ఈ పరిణామాలను ఆసరాగా చేసుకుని గణనీయంగా లాభపడాలని దక్షిణాదిన ఏనాడూ ఏపీలో కాలూనలేని స్థితిలో ఉన్న బీజేపీకి ఇదే అదనుగా రాజమార్గాన్ని తయారు చేయాలన్నదే బీజేపీ పెద్దల ఆలోచన.
బీజేపీ ఏపీలో అధికారంలో ఉంటూనే 2029 నాటికి బలపడేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి కూడా ఈ ఎన్నికలు ఉపయోగపడతాయని భావిస్తోంది. మొత్తానికి చూస్తే ఏపీలో మరోసారి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు బీజేపీ తనదైన మద్దతుని సంపూర్ణంగా ఇస్తోంది. ఇక ఆ మీదట ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు. అంతిమ నిర్ణేతలు గా ఉన్న ప్రజల తీర్పు ఏమిటి అన్నది చూడాల్సి ఉంది.