Begin typing your search above and press return to search.

మోడీ తరువాత బాబే పవర్ ఫుల్ ?

బీహార్ లో జేడీయూ ఉన్నా కూడా నితీష్ కుమార్ పొలిటికల్ గ్లామర్ బాగా పడిపోయిందని ఆయన బీహార్ లో పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   3 Jun 2024 2:45 AM GMT
మోడీ తరువాత బాబే పవర్ ఫుల్ ?
X

అవును ఇదే నిజం అని అంటున్నారు. దేశంలో చూస్తే అటు ఎన్డీయే ఇటు ఇండియా కూటమిగా రాజకీయాలు విడిపోయాయి. రెండు భారీ క్యాంపు లే కనిపిస్తున్నాయి. ఎన్డీయే కూటమి చూస్తే బీజేపీ అతి పెద్ద పార్టీగా ఉంది. ఆ తరువాత చూస్తే తెలుగుదేశం తప్ప మరో పార్టీ కనిపించడం లేదు అని అంటున్నారు. బీహార్ లో జేడీయూ ఉన్నా కూడా నితీష్ కుమార్ పొలిటికల్ గ్లామర్ బాగా పడిపోయిందని ఆయన బీహార్ లో పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు అని అంటున్నారు.

ఆయన తన పదవీ కాలంలో చిన్నపిల్లాటగా అటూ ఇటూ కూటములను మారుస్తూ పోతూ అధికారంలో ఉంటున్నారు అన్నది ప్రజలలో ఏర్పడిన వ్యతిరేక భావన. అది లోక్ సభ ఎన్నికల్లో కనిపిస్తోంది అని అంటున్నారు నితీష్ జేడీయూ కి తక్కువ సీట్లు మాత్రమే వస్తాయని అంటున్నారు.

అదే ఏపీలో టీడీపీ కూటమికి 17 నుంచి 20 దాకా ఎంపీ సీట్లు అని సర్వేలు చెబుతున్నాయి. ఇందులో టీడీపీ వాటా 14 నుంచి 15 దాకా ఉండొచ్చు అని అంటున్నారు. ఈ బిగ్ నంబర్ తో ఎన్డీయేలో మోడీ తరువాత చంద్రబాబు కీలకం అవుతున్నారని అంటున్నారు.

దాంతో బాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సరిపడా అన్ని అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీకి ఏ మాత్రం సీట్లు తగ్గినా బాబు పాత్ర అత్యంత కీలకం అవుతుంది అని అంటున్నారు. ఆయన ఇండియా కూటమిలో నుంచి మిత్రులను ఈ వైపునకు తీసుకుని వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

ఇక మోడీ అమిత్ షా ఇద్దరూ బాబుని బాగా విశ్వసిస్తున్నారు. ఏపీలో బాబు తిరిగి అధికారంలోకి రావడానికి వారు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఏపీలో బాబు పవర్ లో ఉంటే తమకే ఎంతో మేలు అన్నది బీజేపీ పెద్దలు గ్రహించారు అని అంటున్నారు.

ఈ పరిణామాలు చూస్తూంటే మళ్ళీ 1996 నాటి పరిస్థితులే ఢిల్లీలో చోటు చేసుకోబోతాయా అన్న చర్చ కూడా సాగుతోంది. రెండు జాతీయ పార్టీలకు అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోతే ప్రాంతీయ పార్టీల రాజకీయం మొదలవుతుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఆనాడు ప్రాంతీయ పార్టీలను ముందు పెట్టి యునైటెడ్ ఫ్రంట్ అన్న దానిని బాబు శ్రీకారం చుట్టారు. ఇద్దరు ప్రధానులను కూడా ఆయన అలా చేశారు.

ఇపుడు కూడా బీజేపీకి 250 సీట్లు సొంతంగా వస్తే ఓకే కానీ అలా రాకపోతే బాబు ఏమి చేస్తారు ఆయన రాజకీయాలు ఏ విధంగా సాగుతాయన్నది కూడా అతి పెద్ద చర్చ సాగుతోంది. బాబు జాతీయ రాజకీయాల్లో 2024 ఎన్నికల తరువాత కీలకమైన పాత్ర పోషించే తరుణం ఆసన్నం అయింది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.