సైనిక పాలనగా బంగ్లా: మోడీ జై శంకర్ సీరియస్ డిస్కషన్ !
మరో వైపు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా బంగ్లాలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల మీద విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో మాట్లాడినట్లుగా తెలిసింది.
By: Tupaki Desk | 5 Aug 2024 3:24 PM GMTపొరుగు దేశం బంగ్లాదేశ్ లో ఆందోళనకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజా ప్రభుత్వం కుప్ప కూలింది. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. అక్కడ సైనిక ప్రభుత్వం ఏర్పాటుకు చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి. బంగ్లా అల్లర్లు అక్కడ చోటు చేసుకుంటున్న అరాచకాల గురించి ఇరువురూ చర్చించినట్లు తెలిసింది.
బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా తరువాతా అక్కడ వేగంగా మారుతున్న పరిణామాల మీద కూడా చర్చ సాగింది అని అంటున్నారు. అంతే కాదు దేశ సరిహద్దులలో రెట్టింపు భద్రతను ఏర్పాటు చేయడం అలాగే అవసరమైన చోట్ల బలగాలను మోహరించే విషయం మీద కూడా చర్చ సాగింది అని అంటున్నారు.
ఇక బంగ్లా పరిణామాలు దిగజారిన క్రమంలో రెండు రోజుల క్రితమే బీఎస్ఎఫ్ చీఫ్ ని కేంద్రం మార్చిన నేపథ్యం ఉంది. మరో వైపు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా బంగ్లాలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల మీద విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో మాట్లాడినట్లుగా తెలిసింది.
ఇక బంగ్లాదేశ్ భారత్ ల మధ్య గత అయిదారు దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆర్ధిక వాణిజ్య సంబంధాలు బలోపేతం అయ్యాయి. ఈ రెండు దేశాల మధ్య పలు అంశాలలో భాగస్వామ్యం అతి కీలకంగా ఉంటోంది. ఇక ద్వైపాక్షిక వాణిజ్యం విలువ చూస్తే $14 బిలియన్లు ఉంటుంది.
అదే విధంగా బంగ్లాదేశ్ భారతదేశం మధ్య ప్రతీ రోజూ చర్చలు వివిధ అంశాల మీద జరుగుతూనే ఉంటాయి. అవి ప్రధాని స్థాయి నుంచి మంత్రులు అధికారుల స్థాయిలో జరుగుతూ ఉంటాయి. రోడ్లు, జల మార్గాలు, ఆకాశ మార్గాల ద్వారా ఈ రెండు దేశాలు పూర్తి అనుసంధానంతో పనిచేస్తున్నాయి.
అంతే కాదు బంగ్లాదేశ్ కి 1,160 ఎండబ్య్లూ విద్యుత్ ని భారత్ బదిలీ చేసింది. రెందు దేశాలకూ జేవీ ఉన్నాయి. గంగా నది తెస్తా నది సహా అనేక నదీ జలాల ఒప్పందాలు ఉన్నాయి. ఉగ్రవాదం సరిహద్దుల నిర్వహణ రక్షణ రంగాలలఒ రెండు దేశాలు కలసి సంయుక్త ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.
బంగ్లాదేశ్ లో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారత్ $8 బిలియన్ల అప్పు కూడా ఇచ్చి ఉంది. సార్క్, బింస్టెక్ బీబీఐన్ వంటి వేదికల ద్వారా పరస్పర సహకారాలు అందుకుంటూ భారత్ బంగ్లా దేశ్ ముందుకు అడుగులు వేస్తున్నాయి.
ఇలా భారత్ కి బంగ్లా సరిహద్దులలో వ్యూహాత్మకమైన మిత్రుడిగా ఉంటోంది. భారత్ కి ఏమైనా ఊరటను ఇచ్చే దేశంగా ఉంది అంటే అది బంగ్లా అని చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా ప్రమాణం చేసిన కార్యక్రమానికి షేక్ హసీనా వచ్చిన సంగతి విధితమే.
ఇల స్నేహపూర్వకంగా బంగ్లాతో భారత్ కొనసాగడం గిట్టని దేశాలూ ఉన్నాయి. చైనా బంగ్లాని తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మరో వైపు పాకిస్థాన్ దాయాది పాత్రలో ఎటూ ఉంది. ఇపుడు చూస్తే కనుక బంగ్లా దేశ్ సైనిక పాలనలోకి వెళ్ళిపోయింది. దాంతో అతి పెద్ద గ్యాప్ అయితే రెండు దేశాల మీద వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా భారత్ కి ఇపుడు అనేక కొత్త చిక్కులు సరిహద్దులలో పెరిగే అవకాశం ఉంది అని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.