Begin typing your search above and press return to search.

క‌విత‌పై క‌క్ష‌.. ఇది కేసీఆర్ స్టోరీ!

కానీ ఇప్పుడేమో ఇదంతా ఉత్తిదే అని కేసీఆర్ ఓ స్టోరీ చెప్పారు. గ‌తంలో బీఆర్ఎస్ స‌ర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసింద‌ని కేసీఆర్ ఆరోపించారు.

By:  Tupaki Desk   |   20 April 2024 2:30 AM GMT
క‌విత‌పై క‌క్ష‌.. ఇది కేసీఆర్ స్టోరీ!
X

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో క‌ల్వ‌కుంట్ల క‌విత అరెస్టుపై ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎట్ట‌కేల‌కు స్పందించారు. క‌విత అరెస్టు జ‌రిగి నెల రోజులైనా సైలెంట్‌గానే ఉన్న కేసీఆర్‌.. ఇప్పుడు మాట్లాడారు. అంతే కాకుండా త‌న‌దైన స్టోరీ కూడా చెప్పారు. క‌విత అరెస్టు క‌క్ష‌సాధింపేన‌ని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసు ఉత్తిదే అని కొట్టిపారేశారు. ఈ కేసులో మార్చి 15న క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇదే కేసులో మ‌నీ లాండ‌రింగ్ కింద సీబీఐ కూడా క‌విత‌ను అరెస్టు చేసిన విష‌యం విదిత‌మే.

క‌విత అరెస్టు కాగానే ఏదో హైప్ క్రియేట్ చేద్దామ‌ని బీఆర్ఎస్ ప్ర‌య‌త్నించినా పెద్ద‌గా వ‌ర్కౌట్ కాలేద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పైగా లిక్క‌ర్ స్కామ్ కేసులో ఓ మ‌హిళా, అది కూడా ఎమ్మెల్సీగా ఉన్న క‌విత అరెస్టు కావ‌డంతో జ‌నాల్లో ఆమెపై, పార్టీపై మ‌రింత నెగెటివిటీ పెరిగింద‌నే చెప్పాలి. దీన్ని అడ్డుకునేందుకు కేసీఆర్ ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు.

కానీ ఇప్పుడేమో ఇదంతా ఉత్తిదే అని కేసీఆర్ ఓ స్టోరీ చెప్పారు. గ‌తంలో బీఆర్ఎస్ స‌ర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసింద‌ని కేసీఆర్ ఆరోపించారు. అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో బీజేపీ కీల‌క నేత బీఎల్ సంతోష్‌పై కేసు పెట్టామ‌ని కేసీఆర్ చెప్పారు.

సంతోష్‌పై కేసుకు ప్ర‌తీకారంగానే క‌విత‌ను మోఢీ అరెస్టు చేయించార‌ని కేసీఆర్ ఆరోపించారు. బీఎల్ సంతోష్‌పై కేసు లేకుంటే అస‌లు క‌విత‌పై కేసు ఉండేది కాద‌ని చెప్పారు. అయితే ఇన్ని రోజులూ క‌విత అరెస్టును ఎలా ఖండించాలో బీఆర్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కే కాదు కేసీఆర్ కు కూడా తోచ‌లేద‌ని టాక్‌. అందుకే ఇప్పుడు సంతోష్ కేసుతో లింక్ చేస్తూ క‌విత‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌గా అరెస్టు చేయించార‌ని కేసీఆర్ క‌థ అల్లార‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రి ఢల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసు ఉత్త‌దే అయితే క‌విత నెల రోజులుగా జైల్లో ఎందుకు ఉన్న‌ట్లు? ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ జైలుకు ఎందుకు వెళ్లిన‌ట్లు? వీటికి స‌మాధానం కేసీఆర్‌కు మాత్ర‌మే తెలియాల‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ అల్లిన క‌థ‌నే ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు జ‌నాల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. కానీ ప్ర‌జ‌లు మ‌రీ అంత పిచ్చివాళ్లు కాద‌ని, కేసీఆర్ క‌థ‌ల‌ను న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.