అయోధ్య రామాలయంలో మోడీ చేసే పని ఇదా?!
ఈ నెల 22న మోడీ అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభిస్తారని.. బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారని.. కేంద్రం సహా.. బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.
By: Tupaki Desk | 17 Jan 2024 9:35 AM GMTఎటు చూసిన అయోధ్య గురించే చర్చ. ఎవరి నోట విన్నా.. అయోధ్య రామాలయం మాటే. గత పది రోజుల నుంచి దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ దేశాల్లోని భారత్‌కు అనుకూలంగా దేశాల్లోనూ అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తునే ప్రమోట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా భారత్‌లో ఉన్న దాదాపు అన్ని ప్రముఖ దేవాలయాలకూ.. ప్రదాని మోడీ వెళ్తున్నారు. ప్రత్యేక పూజలు, ధ్యానాలు, భజనలతో చుట్టేస్తున్నారు.
మొత్తంగా ఇప్పుడు దేశంలో మోడీ-అయోధ్య ఈ రెండు అంశాలే చర్చనీయాంశాలుగా మారిపోయాయి. మరోవైపు.. ఈ నెల 22న మోడీ అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభిస్తారని.. బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారని.. కేంద్రం సహా.. బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. దీంతో మోడీ ఆ రోజు అయోధ్యలో ఏం చేయనున్నారు? ఆయన చేతుల మీదుగా అక్కడ ఏం జరగనుంది? అనే విషయాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇప్పటికే కర్ణాటకకు చెందిన శిల్పి చేతుల మీదుగా రూపు దిద్దుకున్న బాలరాముని విగ్రహాన్ని రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. దీంతో మోడీ పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఆ రోజు.. అంటే.. ఈ నెల 22న ప్రధాని మోడీ అయోధ్యకు వెళ్లి ఏం చేయనున్నారనే విషయం తాజాగా వెల్లడైంది. అప్పటికే నిలబెట్టిన బాలరాముని విగ్రహం కళ్లకు కట్టిన గంతలను ఆయన విప్పుతారు. అనంతరం.. ప్రత్యేకంగా పంచ హాజరుతులు ఇస్తారు. ఇదీ.. ప్రదాని మోడీ చేసే పని.
కానీ, సంప్రదాయం, వైదిక నియమాల ప్రకారం.. విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముందు.. వారం రోజులు ప్రత్యేక క్రతువులు జరుగుతాయి. ప్రత్యేక హోమాలు కూడా జరుగుతాయి. అయితే.. ఈ క్రతువులో దంపతులు మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. మోడీకి ఈ అవకాశం లేనందున.. రామజన్మ భూమి ట్రస్టు సభ్యులు అనిల్ మిశ్రా మాత్రమే పాల్గొని పూజలు చేయనున్నారు. సో.. మొత్తగా అయోధ్యలో ప్రధాని మోడీ చేసేది కేవలం విగ్రహానికి ఉన్న గంతలను విప్పడమే!