కాంగ్రెస్ రికార్డును బ్రేక్ చేసిన మోడీ!
అలానే.. వరుసగా మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే సొంతం.
By: Tupaki Desk | 5 Jun 2024 4:30 PM GMTజాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు వేరు. అదేవిధంగా రికార్డులు కూడా అనేకం ఉన్నాయి. వీటిలో కొన్ని మంచి రికార్డులు.. మరికొన్ని చెత్త రికార్డులు కూడా ఉన్నాయి. మంచి రికార్డుల విషయానికి వస్తే.. ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించిన పార్టీగా కాంగ్రెస్‌కు అరుదైన రికార్డు ఉంది. అలానే.. వరుసగా మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే సొంతం. గరీబీహఠావో నినాదం ఇచ్చినా.. పేదలకు ఇళ్లు ఇచ్చినా కూడా.. కాంగ్రెస్ రికార్డు సృష్టించింది.
అయితే.. కాంగ్రెస్ సాధించిన ఈ రికార్డుల్లో కొన్నింటిని బీజేపీ వచ్చిన తర్వాత.. బ్రేక్ చేస్తూ వచ్చింది. ఇ లాంటి వాటిలో ఇప్పుడు చర్చనీయాంశమైన.. కీలక విషయం.. తొలి ప్రధాని నెహ్రూ పేరుతో ఉన్న రికార్డు ను బీజేపీ బ్రేక్ చేస్తుండడమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. నెహ్రూ తొలి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఇక, ఆ తర్వాత నుంచి వరుసగా మూడు సార్లు ఆయన అధికారంలోనే ఉన్నారు. 1951-62 మధ్య మూడు సార్లు దేశంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా విజయం దక్కించుకుంది.
దీంతో నెహ్రూనే ప్రధానిగా ఆయా సమయంలో పాలించారు.ఇదొక అరుదైన రికార్డు. దీనిని భేదించాలని.. నెహ్రూ రికార్డును సమం చేయాలని గతంలో ఎవరూ అనుకోలేదు. కానీ, తాజాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రస్తుత ఎన్నికల్లో ఇదే పని చేసింది. వ్యూహాత్మకంగా ముందుకు సాగింది. ఫలితంగా నెహ్రూ పేరిట ఉన్న రికార్డును బీజేపీ సమం చేసింది. లేదా బ్రేక్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మరికొద్ది రోజుల్లోనే వరుసగా మూడోసారి ప్రధాని కానున్నారు. ఇది నెహ్రూ రికార్డును సమం చేయడంతో లెక్క.
ఇక, ఇదేసమయంలో 2014 నుంచి 2024 వరకు కూడా.. బీజేపీ వరుసగా అధికారంలోకి రావడాన్ని కూడా రికార్డుగానే బావించాలి. గతంలో కాంగ్రెస్ మాత్రమే మూడుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ రికార్డును బీజేపీ సాధించింది. మొత్తంగా చూస్తే.. దేశాన్ని పాలించిన వారిలో నెహ్రూ.. మోడీ లు సమం కానున్నారు.
+ నెహ్రూ.. 1947-62 మధ్య కాలంలో 16 సంవత్సరాల 286 రోజులు దేశాన్ని పాలించారు.
+ మోడీ.. 2014-2024 మధ్యకాలంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు మరో ఐదేళ్లు ఆయన పాలన చేయనున్నారు.