Begin typing your search above and press return to search.

మోడీ ఇప్పుడు ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారు?

వారే కాదు.. వామపక్షవాదులు.. లౌకికవాదుల పేరుతోనూ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.

By:  Tupaki Desk   |   5 May 2024 5:36 AM GMT
మోడీ ఇప్పుడు ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారు?
X

యావత్ దేశం ఇప్పుడు ఎన్నికల వేడిని ఎదుర్కొంటోంది. ఓవైపు భానుడి భగభగలు.. మరోవైపు ఎన్నికల వేడితో సగటు భారతీయుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పోటాపోటీగా సాగుతున్న ప్రచారంలో మోడీ అప్రతిహతంగా దూసుకెళుతున్నప్పటికీ... ఆయన టార్గెట్ పెట్టుకున్న 400 ప్లస్ ఎంపీ స్థానాలు దక్కుండా ఉండేందుకు రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వారే కాదు.. వామపక్షవాదులు.. లౌకికవాదుల పేరుతోనూ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.

ఇలాంటివేళ.. ప్రధానమంత్రి మోడీ ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టం. ఎందుకంటే.. ఆయన్ను నేరుగా కలిసిన జర్నలిస్టులు తక్కువగా ఉంటారు. ఆయనతో కాస్తంతఎక్కువసేపు మాట్లాడిన జర్నలిస్టులు.. అంతో ఇంతో అసెస్ చేయగలుగుతారు. అయితే.. ఇప్పటివరకు అలాంటి అవకాశం లేకుండా ఉండేది. తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు ప్రధానమంత్రి మోడీని కలవటం.. ఆయనతో మాట్లాడటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వారి అనుభవం.. ప్రధాని మోడీ మాటల్లోనూ ఏం కనిపించింది? ఆయన్ను ప్రశ్నలు వేసినప్పుడు సమాధానాలు చెప్పే విషయంలో ఆయన వ్యవహారశైలి ఎలా ఉందన్న విషయానికి సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. మూడోసారి అధికారంలోకి రావటం ఖాయమై.. ఇక ప్రమాణ స్వీకారం చేయటమే మిగిలిందన్న భావన ప్రధాని నరేంద్ర మోడీలో ఉన్నట్లుగా అనిపించినట్లుగా చెబుతున్నారు. హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి వంద రోజుల్లోనే ఏయే పనులు చేయాలన్న దానిపై మోడీ కసరత్తు పూర్తి చేయటమే కాదు.. పక్కా ప్లానింగ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇంతకూ ఎప్పుడూ ఏ సందర్భంలోనూ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వని ప్రధాని మోడీ ఈసారి ఎందుకు ఇచ్చినట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.దీనికి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈసారి ఎన్నికల్లో 370 సీట్లను సొంతంగా సాధించాలన్న పట్టుదలతో పాటు.. కూటమి 400లకు పైగా సీట్లను సొంతం చేసుకోవాలన్న లక్ష్యానికి చేరువ అయ్యేందుకు.. ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు మరింత సమాచారాన్ని అందించాలన్న ఉద్దేశం కనిపిస్తుందని చెబుతున్నారు. బీజేపీపైనా.. తనపైనా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు వీలుగా ఇంటర్వ్యూ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

మోడీ బాడీలాంగ్వేజ్ కానీ.. ఆయన మాటలు కానీ చాలా నమ్మకంగా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవటం ఖాయమన్న భావన ఉందని చెబుతున్నారు. తన కమిట్ మెంట్.. తాను మాట ఇస్తే తప్పనన్న విషయాన్ని స్పష్టం చేసిన ఆయన.. ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిని ఖాయమని నమ్ముతున్నట్లుగా చెబుతున్నారు. ఆయన్ను... ఆయన తీరును తప్పుపట్టేవారు.. ఆయన్ను కలిసి ఇంటర్వ్యూ చేసిన తర్వాత మాత్రం ఆయన మీద ఉన్నఅంతకు ముందున్న అభిప్రాయం తప్పక మారుతుందని మాత్రం చెబుతున్నారు.