Begin typing your search above and press return to search.

జెలెన్ స్కీతో మోడీ ఆత్మీయ ఆలింగనం... ఐరాస కీలక వ్యాఖ్యలు!

ఈ సమయంలో... మోడీకి స్వాగతం పలికిన జెలెన్ స్కీ.. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 5:26 PM GMT
జెలెన్  స్కీతో మోడీ ఆత్మీయ ఆలింగనం... ఐరాస కీలక వ్యాఖ్యలు!
X

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీకి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజధాని కీవ్ లోని అమరుల స్మారక ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సమయంలో... మోడీకి స్వాగతం పలికిన జెలెన్ స్కీ.. ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.


అవును... సుమారు 30ఏళ్ల క్రితం భారత్ – ఉక్రెయిన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తర్వాత ఆ దేశంలో కాలు మోపిన తొలి భారత ప్రధానిగా మోడీ చారిత్రాత్మక పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రష్యాదాడిలో మరణించిన ఉక్రెయిన్ చిన్నారులకు మోడీ నివాళి అర్పించారు.


ఇదే క్రమంలో ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభాల ఆనవాళ్లకు సంబంధించి అక్కడి మ్యూజియంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను జెలెన్ స్కీ తో కలిసి మోడీ వీక్షించారు. ఇదే క్రమంలో కీవ్ లో ఉన్న మహాత్మగాంధీ విగ్రహానికి మోడీ నివాళి అర్పించారు. ఈ నేపథ్యంలో... రష్యా – ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారం మార్గాలపై ఇరువురు నేతలూ చర్చించనున్నారు.


ఈ సందర్భంగా ఎక్స్ లో స్పందించిన మోడీ... అధ్యక్షుడు జెలెన్ స్కీ తో కలిసి అమరుల స్మారకం వద్ద నివాళి అర్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం చిన్నారులకు వినాశకరమైంది. ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి అని చెబుతూ.. దుఃఖం నుంచి బయటపడే మనోధైర్యాన్ని వారికి ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.


ఈ సందర్భంగా రష్యా – ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటన దోహదపడుతుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఐరాస చీఫ్ భావిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు.


కాగా... రెండు రోజుల పోలాండ్ పర్యటనను ముగించుకున్న ప్రధాని మొడీ... సుమారు 10 గంటలు రైల్లో ప్రయాణించి ఉక్రెయిన్ చేరుకున్నారు. ఈ సమయంలో అక్కడి భారత సంతతి ప్రజలు రైల్వేస్టేషన్ కు చేరుకుని మోడీని ఘనస్వాగతం పలికారు. 1991 లో సోవియట్ నుంచి విడిపోయి ఉక్రెయిన్ గా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి అనే సంగతి తెలిసిందే.