వరల్డ్ కప్.. హీట్ పెంచేసిన ప్రధాని మోడీ!
ఇప్పటికే ఈ మ్యాచ్ ప్రత్యక్ష వీక్షణం కోసం.. దేశదేశాల నుంచి క్రికెట్ అభిమానులు భారత్‌కు వచ్చారు. వస్తున్నారు.
By: Tupaki Desk | 16 Nov 2023 5:34 PM GMTఈ నెల 19న జరగనున్న వన్డే ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ వేడి మరింత పెరిగిపోయింది. ఇప్పటికే ఈ వేడి ఓ రేంజ్‌లో ఉండగా.. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ హీట్‌ను పీక్స్‌కు తీసుకువెళ్లారు. న్యూజిలాం డ్‌పై ఘన విజయం దక్కించుకున్న రోహిత్ సేన.. ఈ నెల 19న ఫైనల్‌లో తలపడి కప్ సాధించుకునేందు కు పంతంతో అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మ్యాచ్ ప్రత్యక్ష వీక్షణం కోసం.. దేశదేశాల నుంచి క్రికెట్ అభిమానులు భారత్‌కు వచ్చారు. వస్తున్నారు.
గుజరాత్ లో అహ్మదాబాద్‌లో రెండేళ్ల కిందట నూతనంగా నిర్మించిన నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ప్రపంచ కప్ తుది సమరం జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. ఆయన ఈ మ్యాచ్‌ను ఆసాంతం వీక్షించనున్నారు. పైగా తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో జరుగుతుండడంతో ఆయన దీనికి ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం.
మరోవైపు.. ప్రపంచ దేశాల రాయబారులను కూడా బీసీసీఐ ఆహ్వానించింది. ఇక, క్రికెట్ దిగ్గజాలు, బాలీవుడ్ నటులు సహా.. అనేక మంది కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందు కు రెడీ అయ్యారు. ఈ స్టేడియంలో ఒకే సారి 1,32,000 మంది కూర్చుని వీక్షించేందుకు వీలుంది. ప్రపంచంలోనే ఈ స్టేడియం అతి పెద్దది కావడం గమనార్హం. మొత్తానికి మోడీ రాకతో.. ప్రపంచ కప్ పై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.