Begin typing your search above and press return to search.

కేసీయార్ రూట్ లోకి మోడీ ...ఆశలు ఆవిరేనా...?

ఇపుడు అదే కేసీయార్ రూట్ లోకి మోడీ కూడా వచ్చారు అని అంటున్నారు. ఎన్నికలకు మీతో పాటే అంటూ కేంద్రంలోని బీజేపీ కూడా రెడీ అవుతోంది.

By:  Tupaki Desk   |   5 Sep 2023 12:30 AM GMT
కేసీయార్ రూట్ లోకి మోడీ ...ఆశలు ఆవిరేనా...?
X

కేంద్రం జమిలి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. తెలంగాణాలో తమ సత్తా చాటడానికి చూస్తోంది. ఒకేసారి ఎన్నికలు అంటూ ముందుకు వస్తోంది. ఇలా ఒకేసారి ఎన్నికల బాధను తప్పించుకోవడానికి తన జాతీయ రాజకీయ ఆశలను కొనసాగించడానికి 2018లో కేసీయార్ ఆరు నెలల ముందు అసెంబ్లీకి రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.

ఇపుడు అదే కేసీయార్ రూట్ లోకి మోడీ కూడా వచ్చారు అని అంటున్నారు. ఎన్నికలకు మీతో పాటే అంటూ కేంద్రంలోని బీజేపీ కూడా రెడీ అవుతోంది. దీని వల్ల తెలంగాణాలో సమీకరణలు ఏమైనా మారుతాయా అన్నది చూడాలి. అదే సమయంలో ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి జరిగితే ఎవరికి అడ్వాంటేజ్ అన్న చర్చ కూడా ఉంది.

బీజేపీ ఒక్క అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అదే ఎంపీ ఎన్నికలు కూడా జత అయితే ఆటోమేటిక్ గా బలం వస్తుంది. మోడీ అమిత్ షాలు కూడా తెలంగాణా అంతటా తిరుగుతారు. పైగా కేంద్ర ప్రభుత్వ విజయాలను ఏకరువు పెడతారు. తాము ఎంతో చేశామని చెప్పుకుంటారు.

దేశంలో బీజేపీ అనుసరిస్తున్న కొన్ని విధానాలతో పాటు బీజేపీ మార్క్ హిందూత్వకు కూడా పదును పెడతారు. తెలంగాణాలోని కొన్ని పాకెట్స్ లో ఉన్న హిందూత్వ సెంటిమెంట్ పాలిటిక్స్ ని బీజేపీ తన వైపు తిప్పుకోవడానికి అలా అవకాశం ఏర్పడుతుంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే డిసెంబర్ లో తెలంగాణా ఎన్నికలు పూర్తి చేసుకుని హ్యాట్రిక్ కొట్టి ఆ మీదట అంటే 2024 మేలో జరిగే లోక్ సభ ఎన్నికల కోసం దేశమంతా తిరగాలని కేసీయార్ టార్గెట్ పెట్టుకున్నారు. అంతే కాదు ముందు అసెంబ్లీ ఎన్నికలు కనుక జరిగిపోతే కాంగ్రెస్ తో పాటు అంతా ఉన్న ఇండియా కూటమిలోకి చేరే విషయం కూడా బీయారెస్ సీరియస్ గా పరిశీలించే అవకాశం ఉంటుంది అని అంటున్నారు.

ఇక కేసీయార్ మహారాష్ట్ర మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. అక్కడ కనీసం అయిదు ఎంపీ సీట్లలో అయినా అభ్యర్ధులను నిలబెట్టి గెలిపించుకుంటే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చు అన్నది ఆయన ఆలోచనగా ఉంది. ఏది ఏమైనా తెలంగాణాలో కేటీయార్, ఢిల్లీ రాజకీయాల్లో తాను అని గిరి గీసుకుని బీజేపీ మీద బస్తీ మే సవాల్ అని వెళ్లడానికి కేసీయార్ కి అసలు ఏ కోశానా చాన్స్ అన్నది లేకుండా చేసేందుకు బీజేపీ ఈ మాస్టర్ ప్లాన్ వేసింది అని అంటున్నారు.

అంతా కలసి ఒకేసారి ఎన్నికల గోదాలోకి దిగిపోతే రాష్ట్రం ముఖ్యం కాబట్టి ముందు అక్కడే కేసీయార్ పోరాడాల్సి ఉంటుంది. అలా 2024 లోక్ సభ ఎన్నికలు, జాతీయ రాజకీయాలు అన్న కేసీయార్ కల మాత్రం నెరవేరకుండా బీజేపీ జమిలి పేరుతో ముందుకు వచ్చిందని అంటున్నార్. బీజేపీ ప్లాన్ కనుక వర్కౌట్ అయితే మాత్రం కేసీయార్ నేషనల్ పాలిటిక్స్ ఆయన బీయారెస్ పార్టీ సైతం కేరాఫ్ తెలంగాణా అనాల్సిందే అంటున్నారు.

ఇక జాతీయ రాజకీయాలు ఏమైనా ప్రభావితం చూపిస్తే తెలంగాణాలో కొత్త రాజకీయ సమీకరణలు కూడా పుట్టుకుని వస్తాయని అపుడు హ్యాట్రిక్ టార్గెట్ నెరవేరే అవకాశాలు సైతం ఉండకపోవచ్చు అని అంటున్నారు.