Begin typing your search above and press return to search.

విప‌క్షాల‌కు మోడీ చెక్‌.. కీల‌క బిల్లులే అజెండా!

అంటే.. విప‌క్షాల రాద్ధాంతం మ‌ధ్యే బిల్లుల‌కు ప‌చ్చ‌జెండా ఊపే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   25 July 2023 10:46 AM GMT
విప‌క్షాల‌కు మోడీ చెక్‌.. కీల‌క బిల్లులే అజెండా!
X

పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఎవ‌రి దారి వారిదిగా క‌నిపిస్తోంది. అయితే.. విప‌క్షాల మాట ఎలా ఉన్నా.. ప్ర‌భుత్వ ప‌క్షం వేస్తున్న పాచిక‌తో అంతిమంగా.. ప్ర‌జ‌లకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజా గా వ‌ర్షాకాల పార్ల‌మెంటు స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్షాలన్నీ కూడా మ‌ణిపూర్ రాష్ట్రంలో చెలరేగిన అల్ల‌ర్ల‌పై విప‌క్షాలు ప‌ట్టుబ‌డుతున్నాయి.

అయితే.. దీనికి అధికార ప‌క్షం స‌సేమిరా అంటోంది. దీంతో పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు వాయిదా ప‌డుతున్నాయి.

అయితే.. మోడీ స‌ర్కారు ఈ స‌మావేశాల‌ను స‌ద్వినియోగించుకుని.. 31 కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ పెట్టి ఆమో దించుకునేందుకు రెడీ అయింది. అయితే.. స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న నేప‌థ్యంలో ఈ బిల్లుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌వేశ పెట్ట‌లేదు.

అయితే.. ఇంకా ఉపేక్షించ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని భావిస్తున్న మోడీ స‌ర్కారు.. స‌ద‌రు బిల్లుల‌ను ప్ర‌వేశ పెట్టి ఆమోదించుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది. అంటే.. విప‌క్షాల రాద్ధాంతం మ‌ధ్యే బిల్లుల‌కు ప‌చ్చ‌జెండా ఊపే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

తాజాగా ప్ర‌ధాన మంత్రి బీజేపీ ఎంపీల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విప‌క్షాల‌ను ప‌ట్టించుకోవా ల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు. విప‌క్షాల‌ను స‌హ‌క‌రించాల‌ని మ‌రోసారి కోరదామ‌ని.. లేక‌పోతే.. బిల్లుల‌ను ప్ర‌వేశ పెట్టి ఆమోదించుకుందామ‌ని వారికి చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా బిల్లుల‌ను ఆమోదించుకుంటే.. మెజారిటీ ప్ర‌జానీకానికి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్ర‌తిప‌క్షాలు ఆయా బిల్లుల్లోని మంచి చెడుల‌ను చెప్ప‌క‌పోతే.. క‌ష్ట‌మ‌ని.. అంటున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. మొత్తానికి విప‌క్షాల ఆందోళ‌న‌ల మ‌ధ్య బిల్లుల‌కు మోడీ ప్రాధాన్యం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.