Begin typing your search above and press return to search.

"#మెలోడీ"... మోడీతో ఇటలీ పీఎం మెలోని సెల్ఫీ వైరల్!

ప్రస్తుతం జీ7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పలు ద్వైపాక్షిక భేటీలతో తీరిక లేకుండా గడిపారు

By:  Tupaki Desk   |   15 Jun 2024 6:10 AM GMT
#మెలోడీ... మోడీతో ఇటలీ పీఎం మెలోని సెల్ఫీ వైరల్!
X

ప్రస్తుతం జీ7 సదస్సు కోసం ఇటలీ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం పలు ద్వైపాక్షిక భేటీలతో తీరిక లేకుండా గడిపారు. ఇందులో భాగంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్ సహా పలుదేశాధినేతలతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో... వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

ఆ సంగతి అలా ఉంటే... గత ఏడాది డిసెంబర్ లో ఇంటర్నెట్ లో వైరల్ అయిన “#మెలోడీ” ట్రెండ్ ను అనుసరిస్తూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇటలీ ప్రధానమంత్రి జారియా మెలోనీ తాజాగా మరోసారి వైరల్ అయ్యారు. ఇందులో భాగంగా జీ7 సదస్సులో మరోసారి సెల్ఫీకి ఫోజులిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

అవును... జీ7 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, భారత ప్రధాని మోడీ మోసారి సెల్ఫీకి ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలూ ఆనందంగా నవ్వుతూ సెల్ఫీకి ఫోజులిచ్చారు. 2023లో సీఓపీ28 సదస్సు నుంచి మెలోనీ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో మెలోడీ అనే హ్యాష్ ట్యాగ్ తో సెల్ఫీని షేర్ చేశారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఈ హ్యాష్ ట్యాగ్ వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా మెలోనీతో మోడీ ఇరుదేశాల ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా... ఇరు దేశాల అంధ్య రక్షణ, భద్రతా సహకారంపై చర్చించారని తెలుస్తుంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ద్వైపాక్షిక రక్షణ, భద్రతా సహకారంపై ఇరుపక్షాలు చర్చించినట్లు తెలిపాయి.

ఇదే సమయంలో ఇరుదేశాలూ రక్షణ పారిశ్రామిక సహకారాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్నాయని.. ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శనకు రాబోతున్న ఇటాలియన్ విమాన వాహక నౌక ఐటీఎస్ కావూర్, శిక్షణ నౌక ఐటీఎస్ వెస్పుచ్చీ కి స్వాగతం పలికినట్లు తెలిపారు. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.