Begin typing your search above and press return to search.

మోడీ స‌ర్కారుకు అవ‌మానం కాదా?!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కార్య‌క్ర‌మం నీతి ఆయోగ్‌(గ‌తంలో ప్ర‌ణాళికా సంఘం ఉండేది

By:  Tupaki Desk   |   27 July 2024 11:30 PM GMT
మోడీ స‌ర్కారుకు అవ‌మానం కాదా?!
X

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న కార్య‌క్ర‌మం నీతి ఆయోగ్‌(గ‌తంలో ప్ర‌ణాళికా సంఘం ఉండేది. దీనిని తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ తీసుకువ‌చ్చారు. ఈ కార‌ణంగానో.. లేక మ‌రే కార‌ణ‌మో.. మొత్తానికి దీనిని మోడీ వ‌చ్చిన 2014లోనే ర‌ద్దు చేసి.. దీని స్థానంలో నీతి ఆయోగ్ తీసుకువ‌చ్చారు.) ఏటా ప్ర‌ధాని అధ్య‌క్ష‌తన ముఖ్య‌మంత్రుల‌తో క‌లిసి నీతి ఆయోగ్ స‌మావేశం నిర్వ‌హిస్తా రు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రాల వాద‌న‌ను వింటారు. వారి డిమాండ్ల‌ను ప‌రిశీలిస్తారు.

కానీ, గ‌త 7 సంవ‌త్స‌రాలుగా నీతి ఆయోగ్ భేటీ అంటే.. కేంద్రం చెప్ప‌డం.. రాష్ట్రాలు విన‌డం అనే మాటే వ‌చ్చింది. గ‌తంలో ఒక‌సారి.. త‌మిళ‌నాడు అప్ప‌టి ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత ఈ విష‌యంపైనే మోడీతో స్పాట్‌లో గొడ‌వ‌ప‌డి.. బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఇక‌, ఇప్పుడు జ‌రుగుతున్న స‌మావేశానికి ఏకంగా.. ఎనిమిది కీల‌క రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు గైర్హాజ‌ర‌య్యారు. వారి త‌ర‌ఫున అధికారులను కూడా పంపించ‌లేదు. దీంతో ఈ ప‌రిణామం.. మోడీ స‌ర్కారుకు అవ‌మాన‌మేన‌ని జాతీయ మీడియా చెబుతోంది.

ఎవరెవ‌రు గైర్హాజ‌రంటే..

+ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

+ క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌

+ హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్

+ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌

+ కేర‌ళ సీఎం విజ‌య‌న్‌

+ పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్‌

రీజనేంటి?

ఇటీవ‌ల ప్ర‌వేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో త‌మ‌ రాష్ట్రాలకు అన్యాయం జరిగిందనేది.. ఆయా రాష్ట్రాల సీఎంల మాట‌. దీనికి నిరసనగానే ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించారు. ఏపీ, బీహార్‌ల‌పై ఉన్న ప్రేమ త‌మ‌పై లేద‌ని.. రాష్ట్రాల‌ను, ప్ర‌జ‌ల‌ను కూడా స‌మానంగా చూడ‌డం లేద‌ని వారు చెబుతున్నారు. ఏదేమైనా కీల‌క స‌మావేశానికి హాజ‌రు కాకుండా.. నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం ప్ర‌ధానికే ఇబ్బందని జాతీయ మీడియా చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.