పార్లమెంటులో 'ఏడవకండి': కాంగ్రెస్ పై మోడీ వ్యంగ్యాస్త్రాలు!
సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డుపడి.. ఏడవమాకండి అని ఆయన వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 4 Dec 2023 9:50 AM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డుపడి.. ఏడవమాకండి అని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా వచ్చిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. ఇక్కడ అధికారంలో ఉన్న రాజస్ధాన్, ఛత్తీస్‌గఢ్‌లలోనూ కాంగ్రెస్ నేతలు కుదేలేయ్యారు.
ఆయా రాష్ట్రాల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. దీంతో పార్లమెంటులో ఈ అంశాలను లేవనెత్తి.. కాంగ్రెస్ దుమారం చేస్తుందనే ఉద్దేశంతో.. మోడీ.. ఏడవకండి! అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని కోపంతో ఉన్న కాంగ్రెస్ తన కోపాన్ని పార్లమెంట్ సమావేశాల్లో చూపించవద్దని, బీజేపీ గెలిచిందని ఏడవద్దని.. మోడీ కోరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కోపం తెచ్చుకోకుండా పార్లమెంట్ లో చర్చకు రావాలన్నారు. కాగా, 3 రాష్ట్రాల్లో ఘోర ఓటమి తరువాత కాంగ్రెస్ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఇండియా కూటమికి ఈ ఫలితాలతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇదేసమయంలో మోడీ ఇమేజ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే మోడీ.. పైవిధంగా కాంగ్రెస్‌ను ఆటపట్టించారు.
గత తొమ్మిదేళ్ల నుంచి బీజేపీని తిట్టడమే ప్రతిపక్ష నేతలు పనిగా పెట్టుకున్నారని.. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఇకనైనా సానుకూలంగా ఉండాలని కోరారు. ఓటమి నుంచి పాఠం నేర్చుకుని ముందుకు సాగాలని.. ప్రతికూల ధోరణిని వదిలేయాలని సూచించారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.