Begin typing your search above and press return to search.

మోడీ పవార్ చేతులు కలిపారు...సంచలనమే!

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఇవి తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలు అని చెప్పడం గ్రేట్. బీజేపీ పట్ల కఠినంగా విపక్షం ఉండాల ని ఇండియా నేతలు ఒక వైపు అంటున్నారు.

By:  Tupaki Desk   |   1 Aug 2023 9:48 AM GMT
మోడీ పవార్ చేతులు కలిపారు...సంచలనమే!
X

ఒకరు దేశానికి బలమైన ప్రధాని. మరొకరు దేశ రాజకీయాల లో సీనియర్ మోస్ట్ లీడర్. ఈ ఇద్దరూ గతం లో చాలా సార్లు కలుసుకున్నా ఇపుడు మాత్రం ఒక అరుదైన సందర్భంగా ఒకే వేదిక మీదకు రావడం ఒక్కసారిగా జాతీయ రాజకీయాల లో సంచలనం రేపింది. మంగళవారం పూణేలో తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ కార్యక్రమానికి ఈ ఇద్దరూ హాజరయ్యారు.

ఈ కార్యక్రమం లో మోడీకి లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని అందించారు. ముఖ్య అతిధిగా ఎన్సీపీ నేత శరద్ పవార్ అటెండ్ అయ్యారు. నిజంగా ఇది రాజకీయాల్లో చాలా ఆసక్తిని పెంచే విషయం. మరో విధంగా చూస్తే స్పూర్తి దాయకం అని కూడా చెప్పాలి. ఎందుకంటే మహారాష్ట్రలో ఎన్సీపీని బీజేపీ చీల్చి అధికారం లో ఉంది.

అలాగే జాతీయ స్థాయి లో మోడీ వ్యతిరేక కూటమిగా ఇండియా తయారవుతఒంది. ఈ కూటమి లో శరద్ పవార్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇంకో వైపు చూస్తే మోడీ సర్కార్ కి వ్యతిరేకంగా పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానాన్ని విపక్షాలు అన్నీ కలసి పెడుతున్నాయి. ఇలా ఢీ అంటే ఢీ అన్న వాతావరణం దేశమంతా బీజేపీ వర్సెస్ విపక్షం అన్నట్లుగా ఉంది.

అయినా ఇంతటి రాజకీయ సమర నినాదాల మధ్య మోడీ పవార్ కలసి ఒక వేదిక పంచుకోవడం అంటే అరుదైన సన్నివేశం కాకుండా మరేమి చెప్పాలి. మోడీ ఉన్న వేదిక ను పంచుకోరాదని విపక్షాలు శరద్ పవార్ కి సలహా ఇచ్చినా ఆయన అన్నింటినీ తోసిపుచ్చి మోడీతో కలసి రావడం ఒక గొప్ప విశేషం అయితే మోడీ సైతం శరద్ పవార్ తో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వేదిక మీద సందడి చేయడం మరో గొప్ప విశేషం.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఇవి తనకు ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలు అని చెప్పడం గ్రేట్. బీజేపీ పట్ల కఠినంగా విపక్షం ఉండాల ని ఇండియా నేతలు ఒక వైపు అంటున్నారు. తొందరలోనే ఇండియా కూటమి మూడవ భేటీ ముంబై వేదికగా జరగనుంది. అలాంటి తరుణం లో శరద్ పవార్ ఈ మీటింగ్ కి హాజరు కావడం అంటే రాజకీయాలను పూర్వపక్షం చేస్తూ మంచి వాతావరణాన్ని నెలకొల్పాలన్న ఉద్దేశ్యమే అని భావించాలి.

అదే విధంగా ప్రధాని మోడీ సైతం శరద్ పవార్ లో మంచి మిత్రుడినే ఎపుడూ చూస్తూంటారు. రాజకీయం వేరు మిగిలినవి వేరు అన్న నీతిని ఈ ఇద్దరూ మరో మరు నిరూపించారు. ఇది ఇపుడు దేశం లో రాజకీయం చేసే పార్టీలకు అవసరం. ఎంతసేపూ రాజకీయ ప్రత్యర్ధులను శత్రువులుగా చూసే నైజం వైపుగా అడుగులు వేస్తూ అలవాటు చేసుకుంటున్న తీరు నుంచి ఈ ఇద్దరిని చూసి అయినా చాలా మంది లో మార్పు కనిపిస్తే మాత్రం దేశ రాజకీయాల్లో మౌలికమైన మార్పులు వస్తాయని ఆశించవచ్చు.