Begin typing your search above and press return to search.

మూడోసారి ప్రధానిగా మోడీ... హాజరైన వివిధ దేశాధినేతలు

దేశానికి వరసగా మూడు సార్లు ప్రధానిగా ప్రమాణం చేసిన ఘనతను నరేంద్ర మోడీ సాధించారు.

By:  Tupaki Desk   |   9 Jun 2024 3:21 PM GMT
మూడోసారి ప్రధానిగా మోడీ... హాజరైన వివిధ దేశాధినేతలు
X

దేశానికి వరసగా మూడు సార్లు ప్రధానిగా ప్రమాణం చేసిన ఘనతను నరేంద్ర మోడీ సాధించారు. ఇది అరుదైన ఘట్టం. దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ మాత్రమే మూడు సార్లు వరసగా ప్రధానిగా ప్రమాణం చేసి అత్యధిక కాలం పాలించారు.

ఇపుడు అదే వరసలో మోడీ కూడా చేరబోతున్నారు. న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అంగరంగ వైభవంగా జరిగిన మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అలాగే సినీ సెలిబ్రిటీస్ అయిన అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, రజనీకాంత్ వంటి బిగ్ షాట్స్ హాజరయ్యారు.

ఇక నరేంద్రమోదీ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ఈశ్వరుడి మీద ఆయన ప్రమాణం చేశారు. ఆ విధంగా స్వతంత్ర భారతంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి అయిన ప్రధాని అయిన రికార్డ్ మోదీ సొంతం చేసుకున్నారు.

ఇక మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హజరైన వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్ రమణ ఉన్నారు.

అలాగే మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భూటాన్ పీఎం షేరింగ్ తోబ్‌గే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొయిజ్జు, శ్రీలంక అధ్యక్షుడు విక్రం సింఘే, మణిపూర్ సీఎం బీరెన్ సింగ్, ఉత్తరాఖండ్ సీఎం దామీ, మండి ఎంపీ కంగనా రనౌత్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, సుప్రీం కోర్టు సీజేఐ చంద్రచూడ్ తదితరులు పాల్గొన్నారు.

మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా ఈ దేశంలో కాంగ్రెస్ ఒక్కటే అత్యధిక కాలం ప్రధానిగా ఉండగలదు అన్న ఒక ప్రచారాన్ని తిప్పికొట్టగలిగారు. ఆయన ఈ టెర్మ్ అయిదేళ్ళూ పూర్తి చేస్తే కనుక నెహ్రూ ఇందిరల తరువాత ప్లేస్ లోకి వస్తారు. అదే సాధించాలని బీజేపీ కూడా భావిస్తోంది.