మోడీ 'గ్యాన్' మంత్రం.. ఎన్నికలకు రెడీ!
వచ్చే ఏడాది అంటే.. మరో మూడు మాసాల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోడీ రెడీ అయిపోయారు.
By: Tupaki Desk | 30 Dec 2023 8:30 AM GMTవచ్చే ఏడాది అంటే.. మరో మూడు మాసాల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోడీ రెడీ అయిపోయారు. ఎలాంటి వెనుక, ముందులు లేవు. ఎలాంటి తర్జనభర్జనలు అంతకన్నా లేవు. ప్రధాని అభ్యర్తి కోసంవెతుకులాటలు కూడా లేవు.. చేతులు కలిపేవారు..కలిసి వచ్చేవారికోసం.. ఎదురు చూపులు అంతకన్నా లేవు. అంతా.. స్ట్రయిట్ అండ్ ఫార్వాడ్. ఎక్కడా సందేహమే లేదు. ఆయన పక్కాగా ఎన్నికలకు రెడీ అయిపోతున్నారు. ఇదే విషయాన్ని తాజాగా ఆయన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఆయన కీలకమైన `గ్యాన్` మంత్రాన్ని పఠించారు. గ్యాన్ అంటే.. గరీబ్ (జీ), యువ (వై), అన్నదాత (ఏ), నారీశక్తి (ఎన్). ఈ నాలుగు పిల్లర్లపైనే ప్రధాని మోడీ వచ్చే ఎన్నికలకు వెళ్లనున్నారు. పేదలు యువత, రైతులు, మహిళలను ఆలంబనగా చేసుకుని వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునే ందుకు మరోసారి మోడీ రెడీ అయిపోయారు. ఇదేసమయంలో ప్రజల మూడ్‌ను కూడా ఆయన పసిగట్టేశారు.
ప్రస్తుతం దేశం అభివృద్ధి చెందుతోందని.. ఇలాంటి కీలకసమయంలో సంకీర్ణ ప్రభుత్వం అవసరం లేదని ఆయన చెబుతున్నారు. ఈ విషయంలో ప్రజలు ఏకాభిప్రాయంతో ఉన్నారన్న ఆయన.. మళ్లీ బీజేపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లవుతుందని, అప్పటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మల్చటానికి గ్యాన్ (జీవైఏఎన్)పై దృష్టి పెడతామని చెప్పారు.
మీడియా మావెంటే
దేశవ్యాప్తంగా మీడియా మావెంటే ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజలు, నిపుణులు, ప్రజాభిప్రాయాన్ని మలిచేవాళ్లు, మీడియా మిత్రులు.. అందరూ బీజేపీతోనే ఉన్నారని చెప్పారు. 100వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలచాలని భావిస్తున్నామ న్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలుగా కొత్త వ్యక్తులను ఎంపిక చేయటంపై స్పంది స్తూ.. ఇది పార్టీలో కొత్తగా వచ్చిన సంప్రదాయం కాదన్నారు. కార్యకర్తలే పునాదిగా ఉన్న పార్టీ బీజే పీ వచ్చే ఎన్నికల్లోనూ విజయం దక్కించుకుంటుందని చెప్పారు.
కట్ చేస్తే.. మోడీని ఓడించాలని.. ఆయనను ఇంటికి పంపించాలని అనుకుంటున్న ఇండియా కూటమి పార్టీలు.. గడప దాటి దూకుడు ప్రయత్నాలు చేయకపోవడం, ఇంకా.. సూచనలు, సలహాలు.. సంప్రదింపులు అంటుండగా.. మోడీ మాత్రం అస్త్ర శస్త్రాలతో రెడీ అయిపోవడం గమనార్హం.